భారత్ కెప్టెన్ విరాట్ నేటి మ్యాచ్‌లో రిస్కీ డెషీషన్ తీసుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో అదిరిపోయే గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్ షమీని న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్‌కు పక్కకు పెట్టాడు. నాలుగు మ్యాచుల్లో హ్యాట్రిక్ సహా 14 వికెట్లు తీసిన బౌలర్ జట్టులో లేకపోవడం క్రికెట్ నిపుణులకు సైతం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. షమీని ఎందుకు జట్టులోకి తీసుకోలేదంటూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత హర్షా బోగ్లే కూడా షమీ జట్టులో లేకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ సైతం కోహ్లి నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు.
గెలిస్తే ఫరవాలేదు కానీ, ఓడితే..! మాత్రం భారత కెప్టెన్ నిర్ణయంపై విమర్శల దాడికి కూడా సిద్దంగా ఉండాలి. ఇక ఈ రోజు భువనేశ్వర్ వేసినా ఫస్ట్ బాల్‌కి కోహ్లి రివ్యూ అడగటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వికెట్ కీపర్ ధోని వారిస్తున్నా కూడా రివ్యూకి వెళ్లడం..అది కాస్త ఫెయిల్ అవ్వడంతో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు.