Viral Photo: ‘ఫొటో ఆఫ్ ది డే’ అంటూ అభిమానుల కామెంట్లు.. కోహ్లీ భుజంపై వాలిన కివీస్ కెప్టెన్! వైరలవుతోన్న ఫొటో

|

Jun 24, 2021 | 5:25 PM

సౌథాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘనవిజయం సాధించి ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్‌ అనంతరం జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

Viral Photo: ఫొటో ఆఫ్ ది డే అంటూ అభిమానుల కామెంట్లు.. కోహ్లీ భుజంపై వాలిన కివీస్ కెప్టెన్! వైరలవుతోన్న ఫొటో
Virat Kohli And Kane Williamson
Follow us on

WTC Final 2021: సౌథాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘనవిజయం సాధించి ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్‌ అనంతరం జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. గెలిచిన ఆనందంలో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌.. ఓటమి బాధలో ఉన్నటీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. ఫ్యాన్స్ దటీజ్ కేన్ మామా అంటూ వైరల్ చేస్తున్నారు. బెస్ట్‌ మూమెంట్ అంటూ కొందరు, ఫొటో ఆఫ్ ది డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే.. విలియమ్సన్‌, కోహ్లీ మంచి స్నేహితులు. అండర్‌-19 నుంచి వీరికి పరిచయం ఉంది. దీంతో మ్యాచ్ అనంతరం కేన్ విలియమ్సన్‌.. కోహ్లీని హత్తుకుని భుజంపై వాలిపోయాడు.

అండర్-19 నుంచి జట్టులో కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. అనంతరం కెప్టెన్లుగా టీం ను ముందుడి నడిపిస్తున్నారు. అయితే ఇద్దరి కల ఒక్కటే. తమ హయాంలో దేశానికి ఒక్క ఐసీసీ ట్రోఫీనైనా అందించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సారథులుగా ఎదిగారు. కానీ, ఐసీసీ టోర్నీల్లో ఆసాంతం అద్భుతంగా ఆడి, చివర్లో బోల్తాపడుతున్నారు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో కోహ్లీసేన సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. అలాగే 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో బోల్తాపడింది. మరోవైపు న్యూజిలాండ్ సైతం 2015, 2019 ప్రపంచకప్‌ చివరి ఆటలో ఓటమిపాలయ్యారు. దీంతో తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని కైవసం చేసుకోవాలని కసి పెంచుకున్నారు. కానీ, చివరికి కివీస్ టీం విజేతగా నిలిచింది. కోహ్లీకి మరోసారి ఐసీసీ ట్రోఫీలో నిరాశే దక్కింది. దీంతో విజయ గర్వం పెంచుకోకుండా కోహ్లీని గట్టిగా హత్తుకుని భుజంపై వాలిపోయాడు కేన్ విలియమ్సన్‌.

Also Read:

On This Day: 17 ఓవర్లలో 42 పరుగులకు ఆలౌట్.. టీమిండియా పతనానికి ఆ బౌలరే కారణం.! ఎవరంటే.?

WTC Final 2021: డబ్ల్యూటీసీ మొదటి ఎడిషన్‌లో ఆటగాళ్ల ఫర్‌ఫార్మెన్స్‌; టీమిండియా నుంచి రహానే, అశ్విన్ మాత్రమే!

Indian Cricket Team: ఫైనల్స్‌లో తడబడుతోన్న టీమిండియా; ఏడేళ్లలో 6 ఐసీసీ ట్రోఫీలు మిస్!