Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్.. అభిమాని లక్ మార్చిన రోహిత్ ఫ్రెండ్..

Viral Cricket Video: శుక్రవారం న్యూలాండ్స్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన SA20 ప్రారంభ మ్యాచ్‌లో, ఎంఐ కేప్ టౌన్ తరఫున ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. రెండు జట్లు కలిపి మొత్తం 449 పరుగులు సాధించాయి. ఇందులో 25 సిక్సర్లు, 40 ఫోర్లు ఉన్నాయి. రికెల్టన్ 65 బంతుల్లో ఆడిన 113 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఎంఐ కేప్ టౌన్‌ను విజయానికి చేరువగా తీసుకెళ్లింది.

Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్.. అభిమాని లక్ మార్చిన రోహిత్ ఫ్రెండ్..
Fan Gets Rs 1.07 Crore For Taking Mi Star One Handed Catch

Updated on: Dec 28, 2025 | 9:08 AM

క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్తే వినోదం లభిస్తుంది. కానీ ఆ మ్యాచ్‌లోనే ఒక క్యాచ్ పట్టి కోటీశ్వరుడైతే? అచ్చం ఇలాంటి అద్భుతమే సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో చోటుచేసుకుంది. ఎంఐ కేప్ టౌన్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ కొట్టిన సిక్సర్‌ను స్టాండ్స్‌లో ఉన్న ఒక అభిమాని ఒంటి చేత్తో ఒడిసిపట్టి, ఏకంగా రూ. 1.07 కోట్ల (2 మిలియన్ రాండ్స్) భారీ బహుమతిని గెలుచుకున్నాడు.

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్ నాలుగో సీజన్ తొలి రోజే సంచలనాలకు వేదికైంది. మైదానంలో ఆటగాళ్ల మెరుపులు ఒకెత్తయితే, గ్యాలరీలో ఒక అభిమాని చేసిన విన్యాసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

ఏమిటీ ‘క్యాచ్ ఏ మిలియన్’ (Catch a Million)?..

SA20 లీగ్ నిర్వాహకులు ప్రతి ఏటా “క్యాచ్ ఏ మిలియన్” అనే వినూత్న పోటీని నిర్వహిస్తారు. దీని ప్రకారం, మైదానంలో బ్యాటర్ కొట్టిన సిక్సర్‌ను గ్యాలరీలో ఉన్న ఏ అభిమాని అయినా సరే ఒంటి చేత్తో (One-handed) క్లీన్‌గా పట్టుకుంటే, వారికి భారీ నగదు బహుమతి లభిస్తుంది. ఈ సీజన్ కోసం బహుమతి మొత్తాన్ని 2 మిలియన్ రాండ్స్ (భారత కరెన్సీలో సుమారు రూ. 1.07 కోట్లు) గా నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: Team India: టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా యువ సంచలనం.. సూర్యకుమార్‌పై వేటు.. గిల్‌కు నో ఛాన్స్.?

అసలేం జరిగింది?

ఎంఐ కేప్ టౌన్ వర్సెస్ డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. కేప్ టౌన్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన ఫామ్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ సమయంలో అతను లెగ్ సైడ్ వైపు ఒక భారీ సిక్సర్ బాదాడు. బంతి వేగంగా గ్యాలరీలోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న ఒక అభిమాని ఏమాత్రం తడబడకుండా, గాలిలోకి లేచి బంతిని కేవలం ఒక చేత్తో అద్భుతంగా పట్టుకున్నాడు.

కోటీశ్వరుడిగా మారిన క్షణం..

అతను క్యాచ్ పట్టగానే స్టేడియం అంతా హోరెత్తిపోయింది. కామెంటేటర్లు సైతం ఆ క్యాచ్ చూసి ఆశ్చర్యపోయారు. నిబంధనల ప్రకారం క్లీన్ వన్-హ్యాండెడ్ క్యాచ్ పట్టినందుకు గాను, సదరు అభిమాని ఆ భారీ బహుమతికి అర్హుడయ్యాడు. ఈ సీజన్ మొత్తంలో ఇలా క్యాచ్‌లు పట్టిన వారందరికీ కలిపి ఆ 2 మిలియన్ రాండ్ల మొత్తాన్ని పంచుతారు. ఒకవేళ ఇతను ఒక్కడే అయితే మొత్తం సొమ్ము ఇతనికే దక్కుతుంది.

ఇది కూడా చదవండి: లక్కీ ఛాన్స్ పట్టేసిన ఐపీఎల్ బుడ్డోడు.. టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

వైరల్ వీడియో..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “ఒక్క క్యాచ్ ఒక సామాన్యుడి జీవితాన్ని ఎలా మారుస్తుందో దీనిని చూస్తే అర్థమవుతుంది” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ర్యాన్ రికెల్టన్ కూడా ఆ అభిమాని నైపుణ్యాన్ని అభినందించడం విశేషం.

క్రీడల్లో కేవలం ఆటగాళ్లకే కాదు, అదృష్టం బాగుంటే అభిమానులకు కూడా ఇలాంటి అద్భుతమైన అవకాశాలు దక్కుతాయని ఈ ఘటన నిరూపించింది. గత సీజన్లలో కూడా పలువురు అభిమానులు ఇలా క్యాచ్‌లు పట్టి లక్షాధికారులయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..