Andhra Pradesh: వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచుకున్న టీమిండియా మాజీ క్రికెటర్.. లోక్‌సభ బరిలో?

Ambati Rayudu Joins Ysrcp: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన 6 నెలల తర్వాత, సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు. కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్న సీఎం జగన్ పాలన పట్ల ఆకర్షితుడై పార్టీ తీర్ధం పుచ్చుకున్నట్లు చెప్పారు.

Updated on: Dec 29, 2023 | 8:51 AM

Ambati Rayudu: రాజకీయ మైదానంలోకి క్రికెటర్లు ఎంట్రీ ఇచ్చే ట్రెండ్ నిరంతరం కొనసాగుతూనే ఉంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో క్రికెటర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఆ టీమిండియా మాజీ క్రికెటర్ పేరు అంబటి రాయుడు. అంబటి రాయుడు గురువారం ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్న సీఎం జగన్ పాలన పట్ల ఆకర్షితుడై పార్టీ తీర్ధం పుచ్చుకున్నట్లు చెప్పారు. గత కొన్ని నెలలుగా అంబటి రాయుడు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరు జిల్లాలోని యువత.. విద్యార్థులను కలిసి ముచ్చటించారు. పలు స్కూళ్లను విజిట్ చేశారు. రీసెంట్‌గా విజయవాడలో నిర్వహించిన వ్యూహం సినిమా ఫ్రీరిలీజ్‌ పంక్షన్‌లో ను మంత్రులతో కలిసి స్టేజీ పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, రాజంపేట లోక్‌సభ సభ్యుడు పి మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రాయుడు చేరికకు సంబంధించిన ఫొటోను వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసింది.

అంతకుముందు, అంబటి రాయుడు ఈ ఏడాది మేలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందే రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. IPL 2023 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. టైటిల్ పోరులో, అతను 8 బంతుల్లో 19 పరుగులు చేసి CSKని తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంబటి రాయుడు కూడా భారత్ తరపున ఆడాడు. రాయుడు టీమిండియా తరపున 55 వన్డేలు, 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ODI క్రికెట్‌లో, అతను 3 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో సహా 1,694 పరుగులు చేశాడు. అతను 6 T-20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 42 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 97 మ్యాచ్‌లు ఆడి 6,151 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ ఫార్మాట్‌లో రాయుడు 16 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేశాడు. అతను లిస్ట్-ఎలో 178 మ్యాచ్‌ల్లో 5,607 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..