INDW vs ENGW: ఓటమితో మొదలు; తొలి వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం

|

Jun 28, 2021 | 6:46 AM

భారత మహిళలు ఘోర పరాజయం పాలయ్యారు. మూడు వన్డేలో సిరీస్‌లో తొలి వన్డేలో ఓటమిపాలయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆకట్టుకుని డ్రాగా మలిచిన భారత మహిళలు.. వన్డే సిరీస్‌ను మాత్రం పరాజయంతో మొదలుపెట్టారు.

INDW vs ENGW: ఓటమితో మొదలు; తొలి వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం
Indw Vs Engw
Follow us on

INDW vs ENGW: భారత మహిళలు ఘోర పరాజయం పాలయ్యారు. మూడు వన్డేలో సిరీస్‌లో తొలి వన్డేలో ఓటమిపాలయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆకట్టుకుని డ్రాగా మలిచిన భారత మహిళలు.. వన్డే సిరీస్‌ను మాత్రం పరాజయంతో మొదలుపెట్టారు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లీష్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. భాతర మహిళలు నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ కేవలం 34.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. ఓపెనర్లు స్మృతి మంధాన 10 పరుగులు (1 ఫోర్‌), షఫాలీ వర్మ 15 పరుగులు (3 ఫోర్లు) సాధించి పెవిలియన్ చేరారు. ఏకైక టెస్టులో అర్థసెంచరీలతో ఆకట్టుకున్న షఫాలీ.. అరంగేట్ర వన్డేలో ఆకట్టుకోలేకపోయింది. అయితే, తక్కువ వయసులో వన్టేల్లోకి అరంగేట్రం చేసిన 131వ టీమిండియా ఉమెన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పూనమ్ రౌత్ 32 (4 ఫోర్లు) పరుగులతో ఆకట్టుకుంది. హర్మన్‌ప్రీత్‌ (1) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగింది. ఈ దశలో కెప్టన్ మిథాలీ రాజ్ 72పరుగులతో(7 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. మరో బ్యాట్స్‌ ఉమెన్ దీప్తీ శర్మ (30 పరుగులు) కూడా మిథాలీకి తోడుగా ఆకట్టుకుంది. దీంతో టీమిండియా మహిళలు నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి కేవలం 201 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఎకిల్‌స్టోన్‌ 3, కేథరిన్‌ బ్రంట్, ష్రబ్‌సోల్‌ చెరో 2 వికెట్లు తీశారు.

అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మహిళలు… బీమోంట్‌ (87 నాటౌట్‌; 12 ఫోర్లు, సిక్స్‌), సీవర్‌ (74 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌) అజేయ అర్ధ సెంచరీలతో గట్టేక్కించారు. వీరిరువురు మూడో వికెట్‌కు 119 పరుగులు జోడించి, భారత పరాజయానికి దారి తీశారు. దీంతో ఇంగ్లండ్ టీం 34.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో గోస్వామి, ఏక్తా తలో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో బీమోంట్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. మొత్తానికి తొలి వన్డేలో బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. సిరీస్‌లో రెండో వన్డే మ్యాచ్‌ జూన్ 30న టౌన్‌టన్ లో జరగనుంది.

Also Read:

Star archer Deepika: పారిస్​లో భారత్‌కు పసిడి పంట.. అదరగొట్టిన స్టార్ ఆర్చర్ దీపికా కుమారి

Tokyo Games: ప్రపంచ నెం.1 గా భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్.. ఇదే ర్యాంకుతో ఒలింపిక్స్‌ కు!

Tokyo Olympics 2021: భారత తొలి స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించిన సాజన్ ప్రకాశ్