ఇంగ్లాండ్‌లో పుట్టాడు.. వెస్టిండీస్‌లో క్రికెట్ నేర్చుకున్నాడు.. కట్ చేస్తే అద్భుత సెంచరీతో బౌలర్ల ఊచకోత..

|

Jun 17, 2022 | 8:50 PM

ఆ జట్టు ఆడింది చిన్న టీమ్‌తో అయినప్పటికీ.. ఓ ప్లేయర్ ఆటతీరు మాత్రం చెప్పుకోదగినది అని చెప్పవచ్చు...

ఇంగ్లాండ్‌లో పుట్టాడు.. వెస్టిండీస్‌లో క్రికెట్ నేర్చుకున్నాడు.. కట్ చేస్తే అద్భుత సెంచరీతో బౌలర్ల ఊచకోత..
Phil Salt
Follow us on

ఇఫ్ యూఆర్ బ్యాడ్.. ఐ యామ్ యూఆర్ డాడ్.. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఇది సరిగ్గా సరిపోతుంది. మిగిలిన జట్లు ఏవైనా కూడా రికార్డులు సృష్టిస్తుంటే.. ఈ టీమ్ వాటిని చెరిపేస్తూ కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. తాజాగా ఆ జట్టు ఆడింది చిన్న టీమ్‌తో అయినప్పటికీ.. ఓ ప్లేయర్ ఆటతీరు మాత్రం చెప్పుకోదగినది అని చెప్పవచ్చు. అతడు ఇంగ్లాండ్‌లో పుట్టాడు.. వెస్టిండీస్‌లో క్రికెట్ నేర్చుకున్నాడు.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.. ఆ ప్లేయర్ ఎవరంటే.!

ఫిల్ సాల్ట్. ఈ ఇంగ్లాండ్ కుడిచేతి వాటం బ్యాటర్ నెదర్లాండ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. 93 బంతులు ఎదుర్కొని ఫిల్ సాల్ట్.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 131.18. ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరగా.. సాల్ట్ మరో ఎండ్ నుంచి పరుగుల వరద పారించాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన డేవిడ్ మలన్(125) చక్కటి సహకారం అందించడం.. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 222 పరుగులు జోడించారు.

మొదటి బంతికే బౌండరీ కొట్టే అలవాటు ఫిల్ సాల్ట్ సొంతం. 2019 నుంచి సాల్ట్ T20 మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే, మొదటి 10 బంతుల్లో అత్యధిక స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్న బ్యాటర్ ఫిల్ సాల్ట్. అతడి మొదటి 10 బంతుల, స్ట్రైక్ రేట్ 149.30. కాగా, ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్‌లోని వేల్స్‌లో జన్మించాడు. అతడి తండ్రి వెస్టిండీస్‌లోని బార్బోడోస్‌కు వలస వెళ్ళడంతో సాల్ట్.. 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. అక్కడే క్రికెట్‌లో మెలుకువలు నేర్చుకున్నాడు. సుమారు ఐదేళ్ల పాటు బార్బోడోస్‌లో క్రికెట్‌పై దృష్టి పెట్టి.. ఇంగ్లాండ్ కౌంటీలలో అద్భుతంగా రాణించాడు.