సమవుజ్జీల సమరంలో గెలుపెవరిది..?

|

Jun 25, 2019 | 8:45 AM

ప్రపంచకప్‌లో నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన పోటీ జరగనుంది. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు ఏడుసార్లు తలపడగా… ఆస్ట్రేలియా ఐదింట్లో, ఇంగ్లాండ్ 2 మ్యాచ్‌ల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో రెండు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ సమవుజ్జీల పోరులో ఎవరు గెలుస్తారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ […]

సమవుజ్జీల సమరంలో గెలుపెవరిది..?
Follow us on

ప్రపంచకప్‌లో నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన పోటీ జరగనుంది. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు ఏడుసార్లు తలపడగా… ఆస్ట్రేలియా ఐదింట్లో, ఇంగ్లాండ్ 2 మ్యాచ్‌ల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో రెండు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ సమవుజ్జీల పోరులో ఎవరు గెలుస్తారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బ్యాన్ తర్వాత జట్టులోకి రావడం.. అటు పేస్ ఎటాక్ మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, కౌంటర్‌నైల్‌లతో బలంగా ఉండడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.