
South Africa vs England, 11th Match, Group B: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా 11వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. గాయం కారణంగా మార్క్ వుడ్ ఆడటం లేదు. అతనికి మోకాలికి గాయం అయింది. ఈ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు తమ తొలి విజయం కోసం చూస్తోంది.
దక్షిణాఫ్రికా చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కానీ, ఈ మ్యాచ్ గెలవడం ద్వారా సౌతాఫ్రికా జట్టు సెమీ-ఫైనల్స్‌లో తన స్థానాన్ని భద్రపరుచుకుంటుంది. మరోవైపు, మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన ఇంగ్లీష్ జట్టు, విజయంతో ముగించాలని కోరుకుంటోంది. ఇంగ్లాండ్ భారీ తేడాతో గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్‌ను సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్(w), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..