
క్రికెట్ మైదానంలో రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. బద్దలవుతూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు బద్దలు కాని రికార్డులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి ఓ రికార్డ్ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. 94 సంవత్సరాల క్రితం ఓ ప్లేయర్ తన పేరు మీద ఒక రికార్డును నమోదు చేసుకున్నాడు. అది నేటికీ బద్దలు కాలేదు. ఎవరూ అతని దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఆ స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్.. స్లార్ బ్యాటర్ల పాలిట విలన్‌లా మారాడు. ఇన్నింగ్స్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి హ్యాట్రిక్‌తో 10 వికెట్లు తీసిన ఈ బౌలర్ ఘనతను ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1905 మే 18న జన్మించిన ఇంగ్లాండ్ బౌలర్ హెడ్లీ వెరిటీ 1931లో సృష్టించిన రికార్డు నేటికీ ఉంది. ఇంగ్లాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో, హాడ్లీ వెరిటీ మొత్తం నాటింగ్‌హామ్‌షైర్ జట్టును పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వెరిటీ 19.4 ఓవర్లలో 10 పరుగులిచ్చి హ్యాట్రిక్‌తో 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అతను 16 మెయిడెన్ ఓవర్లు బౌలింగ్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఒక దశలో నాటింగ్‌హామ్‌షైర్ 99 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ, ఆ తర్వాత నాటింగ్‌హామ్‌షైర్ జట్టు మొత్తం హాడ్లీ వెరిటీ దెబ్బకు డీలా పడిపోయింది. యార్క్‌షైర్ 10 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఆ సంవత్సరం ప్రారంభంలో ఈ ఇంగల్ండ్ బౌలర్ వార్విక్‌షైర్‌పై ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.
హెడ్లీ వెరిటీ 14 సంవత్సరాల వయసులో పాఠశాలను విడిచిపెట్టి తన తండ్రితో కలిసి బొగ్గు కంపెనీలో పనిచేశాడు. వెరిటీ చిన్నప్పటి నుంచి యార్క్‌షైర్ మ్యాచ్‌లను చూసేవాడు. వెరిటీ ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లు రెండింటినీ బౌలింగ్ చేయగలడు. బొగ్గు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, అతనికి రాడాన్ రెండవ జట్టుతో క్రికెట్ ఆడే అవకాశం లభించింది. అద్భుత ప్రదర్శన కారణంగా అతనికి యార్క్‌షైర్ జట్టులో స్థానం లభించింది. అక్కడ అతను అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అతనికి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది.
జులై 1931లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాడ్లీ వెరిటీకి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అతను ఇంగ్లాండ్ తరపున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 144 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, అతను 669 పరుగులు కూడా చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
హాడ్లీ వెరిటీ కెరీర్‌లో అత్యంత చిరస్మరణీయమైన క్షణం 1934లో యాషెస్ విజయం. ఈ సిరీస్‌లో, అతను ఆస్ట్రేలియాపై 104 పరుగులకు 15 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, టెస్ట్ క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మాన్‌ను 8 సార్లు అవుట్ చేసిన ఏకైక బౌలర్ హాడ్లీ వెరిటీ. 1943లో ఇటలీలోని కాసెర్టాలోని యుద్ధ ఖైదీ శిబిరంలో మరణించినప్పుడు అతని వయస్సు కేవలం 38 సంవత్సరాలు. అతను తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 14.90 సగటుతో వికెట్లు పడగొట్టాడు. ప్రతి 42 బంతులకు ఒక వికెట్ స్ట్రైక్ రేట్‌తో 1956 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..