Harry Brook Viral Catch: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (ENG vs WI) ప్రారంభమైంది. లార్డ్స్‌లోని చారిత్రక క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించింది. మ్యాచ్ తొలిరోజు టీ సమయానికి ఇంగ్లండ్ జట్టు 1 వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది. అయితే, అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్ పట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌లో ఈ సీన్ చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వయంగా చేశాడు. కరీబియన్ బ్యాట్స్‌మెన్ లూయిస్ ఓవర్ రెండో బంతికి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతను బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. బంతి అతని బ్యాట్ బయటి అంచుని తీసుకొని రెండవ స్లిప్ వైపు గాలిలోకి వెళ్లడం ప్రారంభించింది.
బంతి సెకండ్ స్లిప్‌లోకి రావడం చూసి, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ అద్భుతంగా డైవ్ చేసి మైదానాన్నా తాకబోతున్న సమయంలో ఒంటి చేత్తో పట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్ పట్టిన ఈ క్యాచ్‌ని చూసి బెన్ స్టోక్స్, బ్యాట్స్‌మెన్, స్టేడియంలో ఉన్న అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. హ్యారీ బ్రూక్ ఈ క్యాచ్ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక X ఖాతా నుంచి షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
One of the best slip catches you will EVER see from Harry Brook! 😱
That reaction from Ben Stokes though… 🤣 #EnglandCricket | #ENGvWI pic.twitter.com/0MQwMVDH4H
— England Cricket (@englandcricket) July 10, 2024
హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ యువ ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మెన్. తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అలాంటి ఫీట్ చేయాలనుకుంటున్నాడు. బ్రూక్ బ్యాట్ రాణిస్తే ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌పై ఉక్కుపాదం మోపుతుంది.
వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌కి చివరి మ్యాచ్. వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో చివరిసారి ఆడతానని అండర్సన్ కొంతకాలం క్రితం ప్రకటించాడు. అండర్సన్ తన చివరి మ్యాచ్‌లో బంతితో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. అండర్సన్ తన కెరీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్స్‌మెన్స్‌కు పెవిలియన్ దారి చూపించాడు. ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా పేరుగాంచాడు. అయితే, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 10.4 ఓవర్లు బౌలింగ్ చేసి, కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..