
ICC World Cup Match Report, England vs Bangladesh: ఇంగ్లండ్ 137 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు 365 పరుగుల విజయ లక్ష్యం ఉండగా, షకీబ్ అల్ హసన్ జట్టు 48.2 ఓవర్లలో కేవలం 227 పరుగులకే పరిమితమైంది. ఈ విధంగా జోస్ బట్లర్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ తరపున ఓపెనర్ లిటన్ దాస్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 66 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అయితే, దీని తర్వాత బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. రహీమ్ 64 బంతుల్లో 51 పరుగులు చేశాడు. తౌహీద్ హృదయ్ 61 బంతుల్లో 39 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో పాటు మెహందీ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తంజీద్ హసన్ వంటి బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు.
ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. రీస్ టాప్లీ 10 ఓవర్లలో 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్ 2 వికెట్లు పడగట్టాడు. ఇది కాకుండా మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, సామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 364 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరుపున ఓపెనర్ డేవిడ్ మలన్ 107 బంతుల్లో 140 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. జో రూట్ 68 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అదే సమయంలో, జానీ బెయిర్‌స్టో 59 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ తరపున మెహందీ హసన్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. షోరీఫుల్ ఇస్లాం ముగ్గురు ఆటగాళ్లను అవుట్ చేశాడు. దీంతో పాటు తస్కిన్ అహ్మద్, షకీబ్ అల్ హసన్ చెరో వికెట్ తీశారు.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్ & వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, టాప్లీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11:
తంజీద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..