దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో రోజు డర్బన్‌కు చెందిన ఓ అభిమాని రూ.48.25 లక్షలు అందుకున్నాడు. అదేంటి మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానికి అంత డబ్బు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా.. అక్కడికే వస్తున్నాం.. సౌతాఫ్రికాలో ఎస్‌ఏ20 లీగ్ ప్రారంభమైంది. ఇక రెండో మ్యాచ్ బుధవారం డర్బన్ సూపర్ జెయింట్స్ vs జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. కాగా, ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్‌కు చెందిన డోనావన్ ఫెరీరా 104 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టాడు. అయితే, ఈ క్యాచ్‌ను ప్రేక్షకుల్లో నిలబడి ఉన్న వ్యక్తి ఒంటి చేత్తో పట్టుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి రూ. 48 లక్షలు అందుకున్నాడు.
ఎస్‌ఏ20 లీగ్ సందర్భంగా ‘క్యాచ్ ఏ మిలియన్’ పోటీని టోర్నమెంట్ స్పాన్సర్ నిర్వహిస్తుంది. ఈ పోటీలో 18 ఏళ్లు పైబడిన వారు పాల్గొనవచ్చు. అయితే, అభిమాని ఒంటి చేత్తో బౌండరీ వెలుపల క్యాచ్ పట్టుకుంటే, అతనికి ఒక మిలియన్ ర్యాండ్ ప్రైజ్ మనీ ఇస్తారు. భారత కరెన్సీ ప్రకారం ఈ మొత్తం దాదాపు రూ. 48.25 లక్షలన్నమాట.
మ్యాచ్ గురించి మాట్లాడితే, సూపర్ కింగ్స్‌కు చెందిన డోనావన్ ఫెరీరా తన తుఫాన్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ మ్యాచ్‌లో, అతను 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సహాయంతో 82 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా జోబర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులకు చేరుకోగలిగింది. సూపర్ కింగ్స్ తరపున ఫెరీరాతో పాటు రొమారియో షెపర్డ్ 20 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు.
Boss moves only. ?
We have our first entrant into the #Betway Catch a Million competition and what a grab it was ?#DSGvJSK #Betway #SA20 | @Betway_India pic.twitter.com/HEyrMyOtLA
— SA20_League (@SA20_League) January 11, 2023
ఈ స్కోరును ఛేదించే క్రమంలో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో జోబర్గ్ సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున కెప్టెన్ క్వింటన్ డి కాక్ అత్యధికంగా 78 పరుగులు చేశాడు. కానీ, తన జట్టును గెలిపించలేకపోయాడు. సూపర్ కింగ్స్ బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..