Video: ఉత్కంఠగా మ్యాచ్‌.. బాల్‌తో ఉడాయించిన కుక్క.. కట్‌చేస్తే.. అవార్డు ఇచ్చేసిన ఐసీసీ.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..

|

Feb 08, 2023 | 6:00 PM

టీ20 గేమ్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ప్రతీ బాల్, ప్రతీ ఓవర్‌లోనూ హీట్ పెరిగిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లలో మాత్రం ఈ ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.

Video: ఉత్కంఠగా మ్యాచ్‌.. బాల్‌తో ఉడాయించిన కుక్క.. కట్‌చేస్తే.. అవార్డు ఇచ్చేసిన ఐసీసీ.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
Dog Viral Video
Follow us on

టీ20 గేమ్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ప్రతీ బాల్, ప్రతీ ఓవర్‌లోనూ హీట్ పెరిగిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లలో మాత్రం ఈ ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. అయితే, ఎంతో ఉత్కంఠగా సాగే మ్యాచ్‌లో అప్పుడప్పుడు ప్రేక్షకులు ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆటకు అంతరాయాలు ఏర్పడుతుంటాయి. ఇటీవలే ముగిసిన ఉమెన్స్ అండర్ 19 ప్రపంచకప్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన.. నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లో స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇవ్వడంతో.. అంతా పరేషాన్ అయ్యారు.

ఐసీసీ అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 దక్షిణాఫ్రికాలో నిర్వహించింది. ఐర్లాండ్ U19 మహిళల క్రికెట్ జట్టు క్రికెట్‌లో అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసి ప్రపంచకప్ ఆడేందుకు వచ్చిన జట్టులో చాలామంది యంగ్ ఆటగాళ్లు ఉన్నారు. ఐర్లాండ్ అండర్-19 జట్టు సభ్యురాలు అయోఫ్ ఫిషర్ ఓ పాత వీడియోను ఐసీసీ షేర్ చేసింది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక కుక్క మైదానంలోకి వచ్చి బంతిని తీసుకొని పారిపోవడం చూడొచ్చు. ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టిన తర్వాత.. చివరకు బ్యాటర్‌ వద్దకు చేరుకుని బంతిని ఇచ్చేస్తుంది.

ఇవి కూడా చదవండి

దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు సెక్యూరిటీ లోపాలపై కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు బాల్ ట్యాంపరింగ్ గురించి సరదాగా కామెంట్స్ పంచుకున్నారు. ఈ వీడియో ఐర్లాండ్ క్రికెటర్ ఫిషర్ మాట్లాడుతూ.. తన జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగిందని చెప్పుకొచ్చింది. బ్యాటర్ షాట్ ఆడింది. ఫిషర్ బంతిని విసిరేందుకు వెళ్ళినప్పుడు, కుక్క మైదానంలోకి వచ్చింది. కుక్క తన నోటిలో బంతిని పట్టుకుని, నాన్‌స్ట్రైకర్‌పై నిలబడి ఉన్న బ్యాటర్‌కు అందించింది.

మ్యాచ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కుక్క వీడియో ఇక్కడ చూడండి..

దీంతో ప్లేయర్లు అంతా నవ్వుకోవడం మొదలుపెట్టారు. కాగా, ఈబాల్‌ను డెడ్ బాల్‌గా ప్రకించారు. నెటిజన్లు మాత్రం కీపర్‌పై కామెంట్లు వర్షం కురిపించారు. ధోనిలా స్టప్పింగ్ చేయలనుకుంది. కానీ, కుక్క మధ్యలో ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..