Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: పంత్‌పై చాలా కోపంగా ఉన్నా.. కోలుకున్నాక చెంప చెళ్లుమనిపిస్తా: కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్..

Kapil Dev Comments on Rishabh Pant: ఆసుపత్రిలో కోలుకుంటున్న వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గురించి భారత ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Rishabh Pant: పంత్‌పై చాలా కోపంగా ఉన్నా.. కోలుకున్నాక చెంప చెళ్లుమనిపిస్తా: కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్..
Rishabh Pant
Follow us
Venkata Chari

|

Updated on: Feb 08, 2023 | 4:47 PM

Border-Gavaskar Trophy: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిసెంబర్ 30 న జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. కాళ్లకు రెండు ఆపరేషన్లతో అతను చాలా కాలంగా క్రికెట్ మైదానానికి దూరంగా ఉంటున్నాడు. అయితే, నిన్న హాస్పిటల్ బెడ్‌పై నుంచి బయటకు వచ్చిన పంత్.. ట్వీట్ చేశాడు. కోలుకుంటున్నట్లు అభిమానులకు సమాచారం అదించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ యువ భారత ఆటగాడిని చెంపదెబ్బ కొడతానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కపిల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ విని అంతా ఆశ్చర్యపోతున్నారు.

రిషబ్ పంత్ అంటే తనకు చాలా ఇష్టమని కపిల్ తెలిపాడు. కానీ, ప్రస్తుతానికి పంత్‌పై చాలా కోపంగా ఉన్నానని, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ కోలుకోవడం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. కోలుకున్న తర్వాత పంత్ ఇంటికి వెళ్లి చెంపదెబ్బ కొట్టేస్తానని తెలిపాడు.

కపిల్ దేవ్ పంత్‌పై చేసిన కామెంట్స్‌తో అంతా షాక్ అయ్యారు. కానీ, అందుకు గల కారణాన్ని కూడా భారత మాజీ దిగ్గజం వివరించాడు. కపిల్ దేవ్ అసంతృప్తికి కారణం రిషబ్ పంత్ నిర్లక్ష్యమేనని ప్రకటించాడు. పంత్ గాయం కారణంగా జట్టు చాలా నష్టపోయిందని మాజీ ఆల్ రౌండర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు ముందు టీమిండియా కాంబినేషన్‌ను మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. అన్‌కట్‌తో మాట్లాడుతూ, ‘నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత నేను వెళ్లి అతనికి చెంప చెళ్లుమనిపిస్తాను. తనని తాను జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇస్తాను. అతని గాయం కారణంగా, జట్టులో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. నేను అతని గురించి ఆందోళన చెందుతున్నాను. నేటి యువత ఎందుకు అలాంటి తప్పులు చేస్తున్నారో తెలియడం లేదు. అందుకే పంత్‌పై కోపంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..