Tendulkar – Kambli pension: కాంబ్లీ, సచిన్‌ల్లో ఎవరికి ఎక్కువ పెన్షన్ వస్తుంది?

సచిన్ కాంబ్లీ చిన్ననాటి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరిలో ఒక్కరు క్రికెట్లో పీక్స్‌కు వెళ్తే మరోకరి పాతాళానికి పడిపోయారు. అయితే వారికి ఇద్దిరికి పెన్షన్ ఎంతో తెలుసా?

Tendulkar - Kambli pension: కాంబ్లీ, సచిన్‌ల్లో ఎవరికి ఎక్కువ పెన్షన్ వస్తుంది?
Vinod Kambli

Updated on: Dec 10, 2024 | 11:47 AM

సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరూ కలిసి చిన్ననాటి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరు ఒక్కేసారి కెరీర్ స్టార్ట్ చేసినా సచిన్ క్రికెట్లో రాణించగా, కాంబ్లీ తన కెరీర్‌ను తనే నాశనం చేసుకున్నారు. సచిన్ తర్వాత ఏడాది తర్వాత అరంగేట్రం చేసిన వినోద్ కాంబ్లీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2000లో ఆడాడు. అదే సమయంలో సచిన్ 2013లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత, సచిన్, కాంబ్లీ ఇద్దరూ BCCI నుండి పెన్షన్ పొందుతున్నారు. అయితే ఇద్దరికీ పింఛను మొత్తంలో తేడా ఉంది.

వినోద్ కాంబ్లీ కంటే సచిన్ టెండూల్కర్ ఎక్కువ పెన్షన్ పొందుతున్నాడు. సచిన్, కాంబ్లీ పొందుతున్న పెన్షన్‌లో ఎంత తేడా ఉంది? వీరిద్దరూ బీసీసీఐ నుంచి ప్రతినెలా పొందుతున్న పెన్షన్‌లో రూ.20,000 వ్యత్యాసం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే, ప్రతి నెలా కాంబ్లీ కంటే సచిన్‌కి బీసీసీఐ రూ.20,000 ఎక్కువగా ఇస్తుంది.

సచిన్ టెండూల్కర్ ప్రతి నెలా BCCI నుండి పొందుతున్న పెన్షన్ మొత్తం 50,000 రూపాయలు కాగా వినోద్ కాంబ్లీకి బీసీసీఐ నుంచి ప్రతి నెల రూ.30,000 అంటే రూ.20,000 తక్కువ పెన్షన్ వస్తుంది. ప్రస్తుతం కాంబ్లీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో బీసీసీఐ నుంచి అతను పొందుతున్న పెన్షన్ మాత్రమే అతని ఆదాయ వనరు అని చెప్పవచ్చు. ఇక  సచిన్‌‌ రూ.1400 కోట్ల ఆస్తిపరుడు.

భారత క్రికెట్‌లో వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ మధ్య చాలా తేడా ఉంది. కాంబ్లీ కేవలం 9 సంవత్సరాలు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయితే సచిన్ రెండు దశాబ్దాలకు పైగా కొనసాగాడు. కాంబ్లీ భారతదేశం తరపున 17 టెస్టులు, 104 ODIలు ఆడాడు, అందులో అతను మొత్తం 3500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు, 463 వన్డేలు, 1 టీ20 ఆడాడు. సచిన్ మొత్తం 34357 పరుగులు చేసి 100 సెంచరీలు చేశాడు. వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ మధ్య క్రికెట్‌లో ఈ తేడా ప్రభావం వారిద్దరికీ అందుతున్న పెన్షన్‌పై కూడా కనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి