Team India: ఈ ఫోటోలోని క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా.? టీమిండియా స్పైడీ అంటారు బాబూ..

|

Jul 03, 2024 | 8:17 PM

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మొన్నీమధ్య జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ పరుగులు రాబట్టాడు. ఈ ప్లేయర్ మృత్యుంజయుడు. చావు నుంచి బయటపడి.. టీమిండియా తరపున ప్రపంచకప్ ఆడాడు. ఇంకా చెప్పాలంటే..

Team India: ఈ ఫోటోలోని క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా.? టీమిండియా స్పైడీ అంటారు బాబూ..
Team India
Follow us on

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మొన్నీమధ్య జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ పరుగులు రాబట్టాడు. ఈ ప్లేయర్ మృత్యుంజయుడు. చావు నుంచి బయటపడి.. టీమిండియా తరపున ప్రపంచకప్ ఆడాడు. ఇంకా చెప్పాలంటే.. ఈ ఆటగాడు ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్. అడిలైడ్‌లో టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. అలాగే మనోడు టీమిండియాకు ఫస్ట్ వికెట్ కీపర్ ఆప్షన్. ఎవరో గుర్తుపట్టారా.? మీకు ఈపాటికి అర్ధమై ఉంటుంది. ఈ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని ఫేవరెట్.

ఎస్.! మీరు అనుకున్నది కరెక్టే.. అతడు మరెవరో కాదు రిషబ్ పంత్. టీమిండియా బెస్ట్ బ్యాటర్లలో ఒకడు రిషబ్ పంత్. 2017లో టీ20ల ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం ఇచ్చాడు రిషబ్ పంత్. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో ఆడినప్పటికీ.. మనోడికి అంతగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే ఆ తర్వాత టీ20ల్లో రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్ చూసి.. 2018వ సంవత్సరంలో అతడ్ని టెస్టుల్లో దింపారు సెలెక్టర్లు. ఇక నెక్స్ట్ వన్డేల్లోకి అదే ఏడాదిలో ఎంట్రీ ఇచ్చాడు పంత్. 2021లో ఆస్ట్రేలియా గడ్డపై ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో అడ్డుకుని.. టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు పంత్.

బ్రిస్‌బెన్ వేదికగా నాలుగో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో తనదైన దూకుడు బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా వెన్నువిరిచాడు పంత్. 2022లో ఘోరమైన కారు ఆక్సిడెంట్‌తో అటు ఐపీఎల్‌కు.. ఇటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన పంత్.. సరిగ్గా ఒక ఏడాది తర్వాత మృత్యుంజయుడిగా తిరిగొచ్చి.. టీ20 ప్రపంచకప్ 2024 టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక పంత్ బ్యాటింగ్ గణాంకాలు చూసుకుంటే.. 33 టెస్టుల్లో 2271 పరుగులు, 30 వన్డేల్లో 865 పరుగులు, 74 టీ20ల్లో 1158 పరుగులు చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. ఐపీఎల్ ఢిల్లీకి సారధ్యం వహిస్తున్న పంత్.. 111 మ్యాచ్‌ల్లో 3284 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..