MS Dhoni : పాత రోల్స్ రాయిస్ కారులో ధోనీ షికారు..కారు వెనుక పరుగు తీసిన అభిమానులు.. వీడియో వైరల్!

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆయన ఆటతో కాదు, తన అద్భుతమైన కార్ కలెక్షన్ కారణంగా. ఇటీవల ధోనీ జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో తన వింటేజ్ రోల్స్-రాయ్ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఈ కారును ఆయన తన ఫామ్‌హౌస్ నుంచి బయటకు తీసిన వెంటనే, అభిమానులందరి చూపులు దానిపైనే ఆగిపోయాయి.

MS Dhoni : పాత రోల్స్ రాయిస్ కారులో ధోనీ షికారు..కారు వెనుక పరుగు తీసిన అభిమానులు.. వీడియో వైరల్!
Dhoni

Updated on: Sep 08, 2025 | 11:52 AM

MS Dhoni : భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మైదానంలోనే కాదు, బయట కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. ఈసారి ఆయన తన అరుదైన కారుతో రోడ్డుపై కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రోల్స్ రాయిస్ వంటి వింటేజ్ కారులో ధోనీ షికారు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని హైలైట్స్, ధోనీ కార్ల కలెక్షన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

వింటేజ్ కారులో మహీ

భారత క్రికెట్ అభిమానులకి మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన క్రికెట్ ప్రపంచం నుంచి రిటైర్ అయినా కూడా, ఫ్యాన్స్ దృష్టి ఎప్పుడూ ఆయన మీదనే ఉంటుంది. ధోనీకి బైకులు, కార్లంటే ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా, ధోనీ రాంచీలోని తన ఫామ్‌హౌస్ నుంచి అరుదైన రోల్స్ రాయిస్ కారుతో బయటకు వచ్చారు. ఈ కారు 1980ల నాటి వింటేజ్ రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్ II. ఇది చూడటానికి చాలా క్లాసిక్‌గా, రాజసం ఉట్టిపడేలా ఉంది.

ఫ్యాన్స్ షాక్.. వీడియో వైరల్

ధోనీ తన రోల్స్ రాయిస్ కారులో బయటకు రాగానే రోడ్డుపై ఉన్న అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన కారును, తమ అభిమాన క్రికెటర్‌ను చూసి చాలా మంది ఆయన కారు వెనకాల పరుగులు తీశారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన, అరుదైన కారును ధోనీ స్వయంగా నడపడం చూసి ఆయన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

ధోనీ అరుదైన కార్ల కలెక్షన్

ధోనీ గ్యారేజ్‌లో కేవలం ఈ రోల్స్ రాయిస్ మాత్రమే కాదు, ఎన్నో అరుదైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో

జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్: భారతదేశంలో ఈ కారుని కొన్న మొదటి వ్యక్తి ధోనీనే. దీనికి 6.2-లీటర్ సూపర్ఛార్జ్డ్ V8 హెమీ ఇంజిన్ ఉంది.

హమ్మర్ H2: ధోనీకి బాగా ఇష్టమైన కార్లలో హమ్మర్ H2 ఒకటి. చాలా సందర్భాల్లో ధోనీ ఈ కారులో రాంచీలో షికారు చేస్తూ కనిపించారు. ఇది భారీ ఆకారంతో రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది.

నిస్సాన్ జొంగా: ఇది ఒకప్పటి భారత సైన్యానికి చెందిన వాహనం. ధోనీ దీన్ని 2019లో కొనుగోలు చేసి, తనకి నచ్చినట్లు మార్పులు చేయించుకున్నారు.

మెర్సిడెస్-బెంజ్ G63 AMG: బాక్సీ డిజైన్‌తో కూడిన ఈ లగ్జరీ SUV ధోనీ కలెక్షన్‌లో మరొక అరుదైన కారు.

ఫెరారీ 599 GTO: ధోనీ కార్ల కలెక్షన్‌లో అత్యంత ఖరీదైనది ఫెరారీ. దీని ధర సుమారు రూ. 3.57 కోట్లు. ఇది ధోనీ లగ్జరీ కార్ల మీద ఉన్న ఇష్టానికి నిదర్శనం.

1969 ఫోర్డ్ మస్టాంగ్ 429 ఫాస్ట్‌బ్యాక్: ఈ అద్భుతమైన వింటేజ్ కారు ధోనీ వింటేజ్ వాహనాలపై ఉన్న ఆసక్తిని చూపుతుంది.

బైకుల మీద కూడా అదే ప్రేమ

కార్లతో పాటు ధోనీకి బైకులంటే కూడా అంతే ఇష్టం. ఆయన గ్యారేజ్‌లో దాదాపు 70 బైకులు ఉన్నాయని చెబుతారు. వాటిలో హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, కన్ఫెడరేట్ హెల్‌క్యాట్, కవాసకి నింజా H2, సుజుకి హాయాబుసా వంటి బైకులు ఉన్నాయి. ధోనీ ఈ అరుదైన, ఖరీదైన వాహనాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తరచుగా వాటిని క్లీన్ చేస్తూ కూడా కనిపిస్తారు. ధోనీకి ఉన్న ఈ వాహనాల ప్రేమ, వాటిని కాపాడుకునే విధానం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..