
Viral Video : భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్ పేర్లు ఎప్పుడూ చర్చనీయాంశమే. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని, గంభీర్ ఎప్పుడూ ధోనీపై విమర్శలు చేస్తూ ఉంటాడని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అంతా సవ్యంగానే ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీనిస్తోంది.
వైరల్ వీడియోలో అసలేముంది?
గౌతమ్ గంభీర్ భార్య నటాషా, ఎంఎస్ ధోనీ ఒకరినొకరు కలుసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో నటాషా, ధోనీ చాలా ఆప్యాయంగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఇద్దరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటుండటం చూస్తుంటే, వారి మధ్య ఉన్న బంధం ఎంత దృఢంగా ఉందో అర్థమవుతోంది. గంభీర్, ధోనీ మధ్య ఉన్న అనుబంధం గురించి వస్తున్న రూమర్లకు ఈ ఒక్క వీడియో చెక్ పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ములాఖత్ ఎక్కడ జరిగింది?
టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ కలయిక జరిగినట్లు తెలుస్తోంది. ముంబై, అహ్మదాబాద్‌లలో జరిగిన ఈ కీలక పోరుల కోసం ఎంఎస్ ధోనీ ప్రత్యేకంగా విచ్చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో అయితే రోహిత్ శర్మతో కలిసి ధోనీ స్వయంగా ట్రోఫీని మైదానంలోకి తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలోనే స్టేడియం గ్యాలరీలో నటాషా గంభీర్, ధోనీని కలిశారు. గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండటంతో, నటాషా తన భర్తను ప్రోత్సహించడానికి స్టేడియానికి వచ్చారు.
The way MS Dhoni talking with Gautam Gambhir’s wife.
Gambhir has taken digs at Dhoni whenever he got the chance, but Dhoni has never said a single word against him and has always behaved with grace.
That itself speaks volumes about the kind of personality Dhoni is.🙌🏻 pic.twitter.com/SeJA1htRQA
— Rohan💫 (@rohann__45) March 9, 2026
రూమర్లకు చెక్ పెట్టిన నటాషా-ధోనీ జోక్స్
గౌతమ్ గంభీర్ తరచుగా 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో తన 97 పరుగుల కంటే ధోనీ కొట్టిన సిక్సర్‌కే ఎక్కువ క్రెడిట్ ఇస్తారని అసహనం వ్యక్తం చేస్తుంటారని చాలామంది భావిస్తారు. కానీ, అంతర్గతంగా వీరిద్దరి మధ్య గౌరవం అలాగే ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ధోనీ, నటాషా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి నిజమైన స్నేహానికి నిదర్శనం ఇదీ అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. వరల్డ్ కప్ సందడి ముగియడంతో ధోనీ ప్రస్తుతం తన ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్యాంప్‌లో చేరేందుకు చెన్నైకి వెళ్లారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..