IPL 2021 DC vs SRH : సన్‌రైజర్స్‌పై ఢిల్లీ సునాయాస విజయం.. ఓటమితో రెండో ఎడిషన్‌ ప్రారంభించిన సన్‌ రైజర్స్‌..

|

Sep 22, 2021 | 11:20 PM

IPL 2021 DC vs SRH : ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో ఎడిషన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ప్రారంభించింది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతులెత్తేసింది...

IPL 2021 DC vs SRH : సన్‌రైజర్స్‌పై ఢిల్లీ సునాయాస విజయం.. ఓటమితో రెండో ఎడిషన్‌ ప్రారంభించిన సన్‌ రైజర్స్‌..
Follow us on

IPL 2021 DC vs SRH : ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో ఎడిషన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ప్రారంభించింది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతులెత్తేసింది. సన్‌రైజర్స్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ అలవోకగా ఛేధించింది. ఇంకా 2.5 ఓవర్లు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించారు. సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్స్‌ సక్సెస్‌ అయితే ఆ స్కోరును సునాయాసంగా చేధించడంలో బ్యాట్స్‌మెన్‌ విజయవంతమయ్యారు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ కేవలం రెండు వికెట్లను కోల్పోయి 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్‌ (42), శ్రేయస్‌ అయ్యర్ (41 నాటౌట్‌) రాణించడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీల్లీ క్యాపిటల్స్‌  అగ్రస్థానానికి చేరుకుంది.

ఇక సన్‌రైజర్స్‌ ఓటమికి జట్టు స్కోరు పరిమితంగా ఉండడమే కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా డేవిడ్‌ వార్నర్‌ (0), విలియమ్సన్‌ (18) పరుగులకే వెనుతిరగడంతో జట్టు స్కోరుపై తీవ్ర ప్రభావం పడింది. వీరిద్దరు రాణిస్తే సన్‌రైజర్స్‌ ఢిల్లీకి కనీసం పోటీనిచ్చేది కానీ.. బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో సన్‌రైజర్స్‌ స్వల్ప స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. కెప్టెన్ విలియమ్సన్ (18), ఓపెనర్ సాహా (18), మనీశ్‌ పాండే (17), కేదార్‌ (3), హోల్డర్‌ (10) విఫలమయ్యారు. మరీ తక్కువ స్కోరు నమోదవుతుందనుకున్న సమయంలో అబ్దుల్‌ సమద్‌ (28), రషీద్‌ ఖాన్‌ (22) రాణించడంతో 134 పరుగులనైనా సన్‌రైజర్స్‌ సాధించగలిగింది.

Also Read: CCTV Camera: బాత్రూమ్‌లో కెమెరాలు.. హైదరాబాద్‌లో కేటుగాళ్లు అరాచకం.. ఓ యువతి జాగ్రత్తతో..

Smartphone Settings: మీ స్మార్ట్‌ఫోన్‌ స్లో అవుతుందా..? ఈ సెట్టింగ్స్‌ మార్చితే వేగవంతం అవుతుంది..!

Vaccine with Plant: పాలకూర తింటే చాలు.. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్టే.. ఎలాగంటారా? ఈ స్టోరీ ఫాలో అయిపోండి..