DC vs LSG IPL Match Result: ఫలించని ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం.. 6 పరుగుల తేడాతో లక్నో గెలుపు..

|

May 01, 2022 | 7:56 PM

DC vs LSG IPL Match Result: గెలుపు అనివార్యమైనా మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయం మూటగట్టుకుంది. వరుస విజయాలతో ఊపుతో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌ తమ ఖాతాలో ఏడో విజయాన్ని వేసుకుంది. ఆరు పరుగుల తేడాతో...

DC vs LSG IPL Match Result: ఫలించని ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం.. 6 పరుగుల తేడాతో లక్నో గెలుపు..
Lsg Won The Match
Follow us on

DC vs LSG IPL Match Result: గెలుపు అనివార్యమైన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయం మూటగట్టుకుంది. వరుస విజయాలతో ఊపుతో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌ తమ ఖాతాలో ఏడో విజయాన్ని వేసుకుంది. ఆరు పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. లక్నో ఇచ్చిన 196 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు తొలి నుంచి తడబడ్డారు. పృథ్వీషా (5), డేవిడ్ వార్నర్‌ (3) తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురు దెబ్బతగిలింది.

ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్‌ మార్ష్‌ (37), రిషబ్‌ పంత్‌ (44) పరుగులు చేసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే పనిలో పడ్డారు. అయితే వీరిద్దరూ వరుసగా పెవిలియన్‌ బాటపట్టడంతో ఢిల్లీ మళ్లీ కష్టాల్లోకి జారుకుంది. పావెల్‌ (35), అక్సర్‌ పటేల్‌ (42*) పరుగులతో రాణించినా చివరికి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. లక్నో బౌలర్స్‌లో మొహ్సిన్‌ ఖాన్‌ 4 ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు. తర్వాత దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్‌, గౌతమ్‌ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఇక అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ బ్యాటర్లు దుమ్మురేపారు. నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు సాధించారు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కేవలం 51 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. రాహుల్‌కు తోడుగా దీపక్‌ హుడా కూడా 52 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా వేగంగా పరుగులు సాధించడంతో లక్నో మంచి స్కోరును అందుకోగలిగింది. ఈ విజయంతో లక్నో తన ఖాతాలో 7వ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలోకి ఎగబాకింది.

మరిన్ని ఐపీఎల్ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Viral Photo: అందాల సింధూరం.. మన తెలుగింటి ముద్ద మందారం.. ఎవరో గుర్తించారా..?

Students Fighting: విద్యార్థులా..! వీధి రౌడీలా..! కర్రలతో కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు..

Andhra Pradesh: ఆస్ట్రేలియాకు పంపిస్తే కెనడాకు చేరిన పార్శిల్.. రిటర్న్ తెస్తుండగా ఓపెన్ చేస్తే.. పోలీసులు షాక్