DC vs KKR Highlights, IPL 2021: ఉత్కంఠ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరిన కోల్‌కతా.. పోరాడి ఓడిన ఢిల్లీ

|

Oct 13, 2021 | 11:38 PM

DC vs KKR Highlights in Telugu: ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 136 పరుగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించి, ఐపీఎల్ 2021లో ఫైనల్‌కు చేరుకుంది.

DC vs KKR Highlights, IPL 2021: ఉత్కంఠ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరిన కోల్‌కతా.. పోరాడి ఓడిన ఢిల్లీ
Ipl Kkr Vs Dc

DC vs KKR Highlights in Telugu: ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో కోల్‌కతా టీం అద్భుతం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 136 పరుగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించి, ఐపీఎల్ 2021లో ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో అక్టోబర్ 15 శుక్రవారం నాడు దుబాయ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఏదశలోనూ కోలుకోకుండా చేసింది.  రెండో క్వాలిఫయర్‌లో తలపడుతోన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 135 పరగులు చేసింది. దీంతో కోల్‌కతా టీం ముందు 136 పరుగుల స్కోర్‌ను ఉంచింది. అయితే ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లు ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి ఢిల్లీని చాలా తక్కువ పరుగులకు కట్టడి చేశారు. పృథ్వీ షా(18) పరుగులతో మంచి ఊపులో ఉన్నప్పుడు చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోతూ, పరుగులు సాధించడంలో వెనుకపడ్డారు. ధావన్ (36) ఒక్కడే అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు. స్టోయినిస్ 18, రిషబ్ పంత్ 6, హెట్ మెయిర్ 17 తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. శ్రేయాస్ అయ్యర్ 24, అక్షర్ పటేల్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, శివం మావి, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు.

నేడు షార్జాలో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2021 బోర్డులో ఫైనల్‌కు ముందు ఈరోజు చివరి యుద్ధంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో తలపడనుంది. ఒక వైపు రిషబ్ పంత్, మరోవైపు ఇయోన్ మోర్గాన్‌లు ఫైనల్ చేరేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీ టీం స్థిరమైన ఆటను ప్రదర్శిస్తుండగా, కేకేఆర్ టీం యూఏఈలో గేర్‌ మార్చి ఇక్కడ వరకు వచ్చింది. రిషబ్ పంత్ టీం క్వాలిఫైయర్ వన్‌లో సీఎస్‌కేతో మ్యాచులో ఓడిపోయింది. దీంతో రెండో అవకాశంగా నేడు కేకేఆర్‌తో తలపడనుంది. ఇక కేకేఆర్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి క్వాలిఫయర్ 2 ఆడటానికి అర్హత సాధించింది. మరి నేటి పోటీలో నెగ్గి ఎవరు ఫైనల్ టికెట్ పొందుతారో చూడాలి.

రెండు జట్ల మధ్య గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3-2తో ఆధిక్యం సంపాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 29 సార్లు ఐపీఎల్‌లో తలపడతాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 15 మ్యాచ్‌లు గెలిచింది. 13 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

ప్లేయింగ్ ఎలెవన్:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 13 Oct 2021 11:37 PM (IST)

    ఉత్కంఠ మ్యాచులో కోల్‌కతాదే విజయం

    ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 136 పరుగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించి, ఐపీఎల్ 2021లో ఫైనల్‌కు చేరుకుంది.

  • 13 Oct 2021 11:07 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    మోర్గాన్ (0) రూపంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం కీలక సమయంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. దీంతో కోల్‌కతా విజయానికి 7 బంతుల్లో 7 పరుగులు కావాల్సి ఉంది.

  • 13 Oct 2021 11:00 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    దినేష్ కార్తీక్ (0) రూపంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం కీలక సమయంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. దీంతో కోల్‌కతా విజయానికి 12 బంతుల్లో 10 పరుగులు కావాల్సి ఉంది.

  • 13 Oct 2021 10:53 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    గిల్ (46 పరుగులు, 46 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) రూపంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది.

  • 13 Oct 2021 10:50 PM (IST)

    16 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 123/2

    16 ఓవర్లు ముగిసే సరికి ‌కోల్‌కతా నైట్ రైడర్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో గిల్ 45, త్రిపాఠి 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Oct 2021 10:26 PM (IST)

    అర్థ శతకం సాధించిన వెంకటేష్ అయ్యర్

    కీలక మ్యాచులో కోల్‌కతా ఓపెనర్లు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో అర్థ సెంచరీ పూర్త చేసి కోల్‌కతా విజయాన్ని ఖాయం చేశాడు.

  • 13 Oct 2021 10:13 PM (IST)

    9 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 67/0

    9 ఓవర్లు ముగిసే సరికి ‌కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 67 పరుగులు చేసింది. క్రీజులో గిల్ 26, వెంకటేష్ 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Oct 2021 09:57 PM (IST)

    6 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 51/0

    6 ఓవర్లు ముగిసే సరికి ‌కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 51 పరుగులు చేసింది. క్రీజులో గిల్ 17, వెంకటేష్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Oct 2021 09:44 PM (IST)

    3 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 21/0

    3 ఓవర్లు ముగిసే సరికి ‌కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 21 పరుగులు చేసింది. క్రీజులో గిల్ 11, వెంకటేష్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Oct 2021 09:33 PM (IST)

    కోల్‌కతా టార్గెట్ 136

    ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 135 పరగులు చేసింది. దీంతో కోల్‌కతా టీం ముందు 136 పరుగుల స్కోర్‌ను ఉంచింది.

  • 13 Oct 2021 09:07 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    హెట్ మెయిర్ (17) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది.

  • 13 Oct 2021 09:03 PM (IST)

    18 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 114/4

    18 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం నాలుగు వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. క్రీజులో హెట్ మెయిర్ 17, అయ్యర్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Oct 2021 08:47 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    పంత్ (8) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌ భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్ మిస్ అవ్వడంతో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 15.2 ఓవర్లకు కేవలం 90 పరుగులే చేయగలిగింది. పరుగులు చేసేందుకు ఢిల్లీ టీం చాలా కష్టపడుతోంది.

  • 13 Oct 2021 08:38 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    ధావన్ (36 పరుగులు, 39 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి మరోసారి వికెట్ పడగొట్టి ఢిల్లీ టీంను కోలుకోని దెబ్బ తీశాడు.

  • 13 Oct 2021 08:36 PM (IST)

    14 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 83/2

    14 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండు వికెట్లు నష్టపోయి 83 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 36, శ్రేయాస్ అయ్యర్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Oct 2021 08:27 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    స్టోయినిస్ (18 పరుగులు, 23 బంతులు, 1 ఫోర్) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 13 Oct 2021 08:12 PM (IST)

    9 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 55/1

    9 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒక వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 21, స్టోయినిస్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Oct 2021 07:58 PM (IST)

    ఆరు ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 38/1

    6 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 17, స్టోయినిస్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Oct 2021 07:49 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    పృథ్వీ షా (18 పరుగులు, 12 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టి ఢిల్లీ టీంను దెబ్బ తీశాడు.

  • 13 Oct 2021 07:43 PM (IST)

    మూడు ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 18/0

    3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 1, పృథ్వీ షా 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Oct 2021 07:40 PM (IST)

    తొలి సిక్స్

    ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్‌ను పృథ్వీ షా మూడో ఓవర్ తొలి బంతిని మలిచాడు. షకీబ్ బౌలింగ్‌లో తొలి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్ బాదేశాడు.

  • 13 Oct 2021 07:35 PM (IST)

    తొలి బౌండరీ

    రెండో ఓవర్‌లో తొలి బంతిని పృథ్వీ షా బౌండరీకి తరలించి, ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీని సాధించాడు.

  • 13 Oct 2021 07:33 PM (IST)

    బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ

    టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లుగా ధావన్, పృథ్వీ షా బరిలోకి దిగారు.

  • 13 Oct 2021 07:07 PM (IST)

    DC vs KKR: ప్లేయింగ్ ఎలెవన్

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

  • 13 Oct 2021 06:57 PM (IST)

    DC vs KKR: హెడ్ టూ హెడ్

    రెండు జట్ల మధ్య గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3-2తో ఆధిక్యం సంపాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 29 సార్లు ఐపీఎల్‌లో తలపడతాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 15 మ్యాచ్‌లు గెలిచింది. 13 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

  • 13 Oct 2021 06:57 PM (IST)

    DC vs KKR: ఫైనల్ టికెట్ దక్కేదెవరికో?

Follow us on