IPL 2024: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కెప్టెన్‌గా రిషభ్ రీఎంట్రీకి రంగం సిద్ధం..

Rishabh Pant Re-Entry in IP 2024: 2022 సంవత్సరంలో, రిషబ్ పంత్‌కు భయంకరమైన కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఎంత ప్రమాదకరం అంటే పంత్ కారు పూర్తిగా ధ్వంసమైంది. అంతే కాదు ఈ ఘటనలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని నెలల పాటు పంత్ కాళ్లపై కూడా నిలబడలేని పరిస్థితి నెలకొంది. అయితే, పంత్ ఏనాడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆపరేషన్ తర్వాత ఎంతో కాలం నిరీక్షించి, తిరిగి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి లాంగ్ సిక్సర్లు బాదేందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు.

IPL 2024: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కెప్టెన్‌గా రిషభ్ రీఎంట్రీకి రంగం సిద్ధం..
Rishabh Pant

Updated on: Feb 20, 2024 | 6:03 PM

Rishabh Pant: ఐపీఎల్ (IPL 2024) ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోగా, ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరం నుంచి ఒక పెద్ద శుభవార్త వినిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, రిషబ్ పంత్ క్రికెట్ మైదానంలో తిరిగి రావడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని, అతను IPL మొత్తం సీజన్‌ను ఆడబోతున్నాడని మేనేజ్మెంట్ భావిస్తోంది.

రిషబ్ పంత్ కెప్టెన్‌గా రీఎంట్రీ..

మీడియా నివేదికల ప్రకారం, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు పంత్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని కోలుకోవడానికి సంబంధించిన సానుకూల సంకేతాలు కనిపించాయి. విశేషమేమిటంటే, పంత్ ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తే, అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాటింగ్ చేయడమే కాకుండా సీజన్ మొత్తం వికెట్ కీపింగ్, కెప్టెన్సీని కూడా చేయబోతున్నాడని నమ్ముతున్నారు. టోర్నీకి ముందు పంత్ ఫిట్‌నెస్ DCకి చాలా సానుకూల సంకేతంగా మారనుంది.

పునర్జన్మ అంటూ ట్వీట్..

2022 సంవత్సరంలో, రిషబ్ పంత్‌కు భయంకరమైన కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఎంత ప్రమాదకరం అంటే పంత్ కారు పూర్తిగా ధ్వంసమైంది. అంతే కాదు ఈ ఘటనలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని నెలల పాటు పంత్ కాళ్లపై కూడా నిలబడలేని పరిస్థితి నెలకొంది. అయితే, పంత్ ఏనాడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆపరేషన్ తర్వాత ఎంతో కాలం నిరీక్షించి, తిరిగి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి లాంగ్ సిక్సర్లు బాదేందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు.

మార్చి 22 నుంచి ఐపీఎల్?

వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభం కానున్నట్లు లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ మంగళవారం పీటీఐకి తెలిపారు. దీంతో ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహాలు పూర్తి చేస్తున్నాయి. ప్రాక్టీస్ లోనూ దూసుకెళ్తున్నాయి. అలాగే, ఆయా ఫ్రాంచైజీల్లోని ఖాళీలను కూడా పూర్తి చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:

భారతీయులు: రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, పృథ్వీ షా, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ముఖేష్ కుమార్, యశ్ ధుల్, విక్కీ ఓస్త్వాల్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, సుమిత్ దార్, స్వస్తిక్ గజెల్.

విదేశీ: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్గిడి, హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, ఝై రిచర్డ్సన్, షాయ్ హోప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..