
క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరనివిగా ఉన్నాయి. క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లో వేగవంతమైన సెంచరీ, చమిందా వాస్ 19 పరుగులకి 8 వికెట్లు తీసిన అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ 1000కి పైగా వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజాలుగా నిలిచారు. ఈ అసాధారణ రికార్డులు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. వివరాల్లోకి వెళ్తే.! క్రికెట్ చరిత్రలో ఎంతోమంది ప్లేయర్స్ వచ్చారు.. వెళ్లారు.. కానీ కొందరు మాత్రం తమ పేరును చరిత్రపుటల్లో లిఖించారు. అలా వారు సృష్టించిన కొన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఇప్పటికీ అసాధ్యం. క్రికెటర్లు తమ అద్భుతమైన ప్రదర్శనలతో సాధించిన ఈ ఘనతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, ఐపీఎల్ మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లో 100 పరుగులు సాధించి టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్ అతని హార్డ్ హిట్టింగ్‌కి నిదర్శనం. శ్రీలంకన్ బౌలర్ చమిందా వాస్ 2001లో ఓ వన్డే మ్యాచ్‌లో కేవలం 19 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ బౌలింగ్ గణాంకాలు వన్డే క్రికెట్‌లో అత్యుత్తమమైనవి. అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యికి పైగా వికెట్లు తీసిన బౌలర్లు కేవలం ఇద్దరే ఉన్నారు. శ్రీలంకన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 1347 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వెయ్యికి పైగా వికెట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరు దిగ్గజాల రికార్డులు వారి అద్భుతమైన బౌలింగ్ కెరీర్‌కు నిదర్శనం. ఈ రికార్డులు క్రికెట్ ప్రపంచంలో ఎప్పటికీ చెక్కుచెదరకుండా నిలుస్తాయి.
ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి