DC vs GT, IPL 2023 Highlights: షమీ, రషీద్ దెబ్బకు కుప్పకూలిన ఢిల్లీ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

| Edited By: seoteam.veegam

Apr 08, 2023 | 3:06 PM

Delhi Capitals vs Gujarat Titans IPL 2023 Score in Telugu: గత విజేత గుజరాత్ టైటాన్స్ IPL-2023ని అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది.

DC vs GT, IPL 2023 Highlights: షమీ, రషీద్ దెబ్బకు కుప్పకూలిన ఢిల్లీ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
Dc Vs Gt Live

DC vs GT Score: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 7వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ 163 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత సర్ఫరాజ్ ఖాన్ 30 పరుగులు జోడించాడు. స్లాగ్ ఓవర్లలో అక్షర్ పటేల్ భారీ షాట్లు ఆడుతూ స్కోరును 150 పరుగులకు చేర్చాడు. 22 బంతుల్లో 36 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ తలో 3 వికెట్లు తీశారు.

గత విజేత గుజరాత్ టైటాన్స్ IPL-2023ని అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. ఢిల్లీ సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. నేటి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించి విజయాల ఖాతా తెరవాలని ఢిల్లీ ఉవ్విళ్లూరుతోంది.

ఇరు జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (కీపర్), అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 04 Apr 2023 09:22 PM (IST)

    గుజరాత్ టార్గెట్ 163..

    ఢిల్లీ టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టీం ముందు 163 పరుగుల టార్గెట్ ఉంది.

  • 04 Apr 2023 09:00 PM (IST)

    14 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    ఢిల్లీ 14 ఓవర్లలో 5 వికెట్లకు 112 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్ ఉన్నారు. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న అభిషేక్ పోరెల్ 20 పరుగులు చేసి అవుటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

  • 04 Apr 2023 08:42 PM (IST)

    11 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    ఢిల్లీ 11 ఓవర్లలో నాలుగు వికెట్లకు 88 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్, అభిషేక్ పోరెల్ ఉన్నారు. రిలే రస్సో సున్నాకి అవుటయ్యాడు. అతను అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. జోసెఫ్‌కి ఇది రెండో వికెట్‌. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37 పరుగులు)ను అవుట్ చేశాడు. అంతకుముందు మహ్మద్ షమీ రెండు వికెట్లు తీశాడు. అతను మిచెల్ మార్ష్ (4 పరుగులు), పృథ్వీ షా (7 పరుగులు)లను చేశాడు.

  • 04 Apr 2023 08:25 PM (IST)

    9 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    ఢిల్లీ 9 ఓవర్లలో మూడు వికెట్లకు 70 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. 37 పరుగుల వద్ద కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. అతను అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అంతకుముందు మహ్మద్ షమీ మిచెల్ మార్ష్ (4 పరుగులు), పృథ్వీ షా (7 పరుగులు)లను అవుట్ చేశాడు.

  • 04 Apr 2023 08:09 PM (IST)

    6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    ఢిల్లీ 6 ఓవర్లలో రెండు వికెట్లకు 52 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నారు. 4 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ అవుటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్‌గా పృథ్వీ షా ఔటయ్యాడు. అతని వికెట్ కూడా మహ్మద్ షమీ తీశాడు.

  • 04 Apr 2023 07:54 PM (IST)

    4 ఓవర్లలో ఢిల్లీ స్కోర్..

    ఢిల్లీ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఉన్నారు. 7 పరుగుల వద్ద పృథ్వీ షా ఔటయ్యాడు. అతను అల్జారీ జోసెఫ్ చేతిలో మహ్మద్ షమీకి చిక్కాడు.

  • 04 Apr 2023 07:13 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

    గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్.

  • 04 Apr 2023 07:13 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (కీపర్), అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే.

  • 04 Apr 2023 07:05 PM (IST)

    DC vs GT: టాస్ గెలిచిన గుజరాత్..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 7వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

  • 04 Apr 2023 06:27 PM (IST)

    ఢిల్లీలో గుజరాత్ సత్తా చాటేనా?

    గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో  ఘన విజయం సాధించింది. అయితే, సొంత మైదానంలో ఢిల్లీని ఓడించడం మాత్రం అంత సులభం కాదు.

  • 04 Apr 2023 05:47 PM (IST)

    DC vs GT: ఢిల్లీకి విజయం అవసరం..

    తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి పాలైంది. లక్నో చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో సొంత మైదానంలో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ విజయం సాధించాలని కోరుకుంటోంది.

Follow us on