David Warner Auction Price: ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. వార్నర్ తన తుఫాన్ ఓపెనింగ్ బ్యాటింగ్‌తో ఏ జట్టులోనైనా ప్రవేశించగలడని నిరూపించుకున్నాడు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉండడంతో వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీల కన్ను వార్నర్‌పైనే నిలిచింది. అయితే, SRHతో వార్నర్ చివరి కెప్టెన్సీ అనుభవం అంతగా బాగోలేదు. పేలవ ఫాంతో ఎంతగానో నిరాశపరిచిచన సంగతి తెలిసిందే. ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ ప్రస్తుత యుగంలోని అత్యంత తుఫాన్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ అతడిని విడుదల చేసినప్పటికీ.. వార్నర్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఢిల్లీ, బెంగళూరు మధ్య పోటీ నెలకొనగా.. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విధ్వంసకర ఓపెనర్‌ను దక్కించుకుంది.
ఈ వేలంలో మొదటి ప్లేయర్‌గా శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు అమ్ముడుపోగా.. రెండో ప్లేయర్‌గా అశ్విన్ రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మూడో ప్లేయర్‌గా ప్యాట్ కమ్మిన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 7.25 కోట్లకు, నాలుగో ప్లేయర్‌గా కసిగో రబాడ పంజాబ్ కింగ్స్‌కు రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయారు. ఇక ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. రూ. 6.25 కోట్లకు మహమ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్‌ను ఫ్రాంచైజీ రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో టీం డికాక్‌ను రూ.6.75 కోట్లతో దక్కించుకుంది.
కాగా, ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో జరుగుతోంది. క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ఆక్షన్‌లో పలు సంచలనాలు నమోదవుతున్నాయి. నాలుగేళ్ల విరామం తరువాత భారీ సంఖ్యలో జరుగుతున్న ఈ మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు రోజులు వేలం జరుగుతుంది.