
ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బీసీసీఐ, టీమిండియాను పాకిస్థాన్‌కు పంపకపోవడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తోంది ఐసీసీ. అయితే.. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాకు ఉన్న పెద్ద మైనస్ ఇదే అంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ బల్లగుద్ది చెబుతున్నారు. ఇదేమీ టీ20 మ్యాచ్ కాదు కదా అంటూ భారత సెలెక్టర్లను పరోక్షంగా విమర్శించారు. ఇంతకీ డేవిడ్ దేని గురించి మాట్లాడారో చూస్తే.. టీమిండియా బౌలింగ్ ఎటాక్ గురించి డేవిడ్ కామెంట్ చేశారు. వరల్డ్స్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్, మ్యాచ్ విన్నర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. వెన్ను గాయంతో బుమ్రాను ఈ టోర్నీకి దూరం అయ్యాడు. అతని స్థానంలో ఇటీవలె వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణాను తీసుకున్నారు. ఈ నిర్ణయంతో టీమిండియా బౌలింగ్ ఎటాక్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌గా మారిపోయిందంటూ డేవిడ్ విమర్శించారు.
ప్రధానంగా భారత ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్‌లో మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఉన్నారు. షమీకి ఎక్స్‌పీరియస్ ఉన్నా, అతను గాయం నుంచి కోలుకొని ఇటీవలె తిరిగి జట్టులోకి వచ్చాడు. సో.. షమీపై ఎక్కువగా ఆశలు పెట్టుకోలేం. ఇటీవలె ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కూడా షమీ పెద్దగా రాణించలేదు. ఇక రాణా ఇంగ్లండ్‌తో సిరీస్‌తోనే వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. అర్షదీప్ సింగ్‌కు కూడా పెద్దగా అనుభవం లేదు. అతను ఇప్పటి వరకు కేవలం 9 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఎక్కువగా టీ20 మ్యాచ్‌లు ఆడే అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తీసుకున్నారు. కానీ, ఈ ట్రోఫీ వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. “ఇవి టీ20లు కాదు, చిన్న పార్టీలు కాదు” అని డేవిడ్ పేర్కొన్నారు. వన్డేల్లో మీరు మళ్లీ మళ్లీ వచ్చి బౌలింగ్ చేయాల్సి వస్తుంది. కానీ, అర్షదీప్ సింగ్‌కు అది పెద్దగా చేసిన అనుభవం లేదు. సో.. డేవిడ్ చెప్పినట్లు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్‌లో కావాల్సినంత అనుభవం లేకపోవడం కచ్చితంగా ప్రభావం చూపించే అంశమనే చెప్పాలి.
వన్డేలో మంచి అనుభవం, అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న మొహమ్మద్ సిరాజ్‌ను కారణం లేకుండా పక్కనపెట్టారు. కనీసం బుమ్రా దూరమైన తర్వాత అయినా సిరాజ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తీసుకొని ఉంటే బాగుంటుందని క్రికెట్ పండితులతో పాటు అభిమానులు కూడా భావించారు. కానీ, అలా జరగలేదు. గౌతమ్ గంభీర్ తన ఐపీఎల్ శిష్యుడి వైపే మొగ్గు చూపాడు. ఓవరాల్‌గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్‌తోనే కాస్త టెన్షన్ అని చెప్పాలి. ఎందుకంటే.. బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. పైగా గత కొన్ని నెలలుగా ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇటీవలె ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌తో టచ్‌లోకి వచ్చారు. ఎటు తిరిగి బుమ్రా లేకపోవడం, సిరాజ్‌ను వద్దనుకోవడం టీమిండియాకు కష్టాలు తెచ్చిపెట్టేలానే ఉంది.