Video: అంపైర్ మోసంతోనే సచిన్ డబుల్ సెంచరీ.. అసలు జరిగింది ఇదే: సౌతాఫ్రికా బౌలర్ షాకింగ్ కామెంట్స్

2010లో వన్డే క్రికెట్‌లో చారిత్రాత్మక డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు, భారత ప్రేక్షకులకు భయపడి అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఉద్దేశపూర్వకంగా సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయలేదని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. మాస్టర్ బ్లాస్టర్‌ను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేసినప్పుడు సచిన్ డబుల్ సెంచరీ కంటే పది పరుగులు వెనుకంజలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ వేలు పైకి ఎత్తలేదని డేల్ స్టెయిన్ ప్రకటించాడు.

Video: అంపైర్ మోసంతోనే సచిన్ డబుల్ సెంచరీ.. అసలు జరిగింది ఇదే: సౌతాఫ్రికా బౌలర్ షాకింగ్ కామెంట్స్
Sachin Odi Double Century

Updated on: Aug 26, 2024 | 12:51 PM

2010లో వన్డే క్రికెట్‌లో చారిత్రాత్మక డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు, భారత ప్రేక్షకులకు భయపడి అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఉద్దేశపూర్వకంగా సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయలేదని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. మాస్టర్ బ్లాస్టర్‌ను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేసినప్పుడు సచిన్ డబుల్ సెంచరీ కంటే పది పరుగులు వెనుకంజలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ వేలు పైకి ఎత్తలేదని డేల్ స్టెయిన్ ప్రకటించాడు.

‘అంపైర్ మోసం చేశాడు’

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌తో పాడ్‌కాస్ట్‌లో డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. ‘గ్వాలియర్‌లో మాపై వన్డే క్రికెట్‌లో టెండూల్కర్ మొదటి డబుల్ సెంచరీ చేశాడు. నేను సచిన్‌ను ఔట్ చేసిన సమయంలో 190 పరుగుల వద్ద ఉన్నాడు. అయితే, అంపైర్ ఇయాన్ గౌల్డ్ టెండూల్కర్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు అంటూ చెప్పుకొచ్చాడు.

అంపైర్ ఈ వాదనను వినిపించాడు

డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. ‘నేను ఇయాన్ గౌల్డ్‌ను ఎందుకు ఔట్ ఇవ్వలేదని అడిగాను. దీంతో సచిన్‌ను ఔట్ చేస్తే.. నేను తిరిగి హోటల్‌కి వెళ్లలేను’ అంటూ అంపైర్ చెప్పాడంటూ షాక్ ఇచ్చాడు. 24 ఫిబ్రవరి 2010న సచిన్ టెండూల్కర్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మొదటి డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అతని కంటే ముందు, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ 200 పరుగుల మార్కుకు చేరువయ్యారు. కానీ, ఈ మ్యాజికల్ ఫిగర్‌ను ఏ బ్యాట్స్‌మెన్ దాటలేకపోయారు.

సచిన్ తర్వాత డబుల్ సెంచరీ చేసింది ఎవరు?

సచిన్ తర్వాత 2011లో వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగులు చేయగా, 2013లో రోహిత్ శర్మ 209 పరుగులు చేశాడు. అదే సమయంలో, 2014లో మళ్లీ రోహిత్ శర్మ 264 పరుగులు చేశాడు. ఇది ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డుగా మారింది. ఆ తర్వాత, 2015 ప్రపంచకప్‌లో, క్రిస్ గేల్ 215 పరుగులు చేయగా, ఆ తర్వాత మార్టిన్ గప్టిల్ 237 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మళ్లీ 2017లో రోహిత్ శర్మ మూడో డబుల్ సెంచరీ సాధించి 208 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత, 2018 సంవత్సరంలో చివరి డబుల్ సెంచరీని పాక్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్ సాధించాడు. 210 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు వన్డేల్లో మొత్తం 12 మంది బ్యాట్స్‌మెన్స్ డబుల్ సెంచరీలు సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..