CSK vs KKR Playing XI, IPL 2022: తొలిపోరుకు సిద్ధమైన చెన్నై, కోల్‌కతా.. ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?

ఐపీఎల్ 2022 మెగా వేలం తర్వాత, అన్ని జట్ల రూపురేఖలు మారిపోయాయి. చెన్నై, కోల్‌కతా టీంలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఈ రెండింటిలోనూ చాలా మంది కొత్త ఆటగాళ్లు చేరారు.

CSK vs KKR Playing XI, IPL 2022: తొలిపోరుకు సిద్ధమైన చెన్నై, కోల్‌కతా.. ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?
Ipl 2022 Csk Vs Kkr Playing Xi

Updated on: Mar 25, 2022 | 4:51 PM

ఐపీఎల్ 2022 మరో 2 నెలల పాటు సందడి చేసేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2022(IPL 2022) లో మొదటి ఎన్‌కౌంటర్ మునుపటి సీజన్‌లో ఫైనలిస్ట్‌ల మధ్య జరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తపడనుంది. ఇరు జట్ల కెప్టెన్లు కొత్తవారే కావడంతో తొలిమ్యాచ్‌లో విన్నర్ ఎవరో ఆసక్తికరంగా మారనుంది. చెన్నై ప్రస్తుతం రవీంద్ర జడేజా చేతిలో ఉంటే, కోల్‌కతా కమాండ్‌ శ్రేయాస్ అయ్యర్ చేతిలో ఉంది. అయితే ఇక్కడ కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు. మొత్తం టీమ్ కూడా రెడీగా ఉంది. తొలి మ్యాచులో తలపడబోయే రెండు టీంల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2022 మెగా వేలం తర్వాత, అన్ని జట్ల రూపురేఖలు మారిపోయాయి. CSK, KKR టీంలలోనూ చాలా మంది కొత్త ఆటగాళ్లు చేరారు. ఇటువంటి పరిస్థితిలో, మొదటి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్, జట్టు కలయిక ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

చెన్నై జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందంటే?

ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ జట్టులో ఓపెనింగ్ జోడీ ఈసారి కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రీతురాజ్‌కు మద్దతుగా ఫాఫ్ డు ప్లెసిస్ లేడు. ఇటువంటి పరిస్థితిలో, రాబిన్ ఉతప్ప లేదా డెవాన్ కాన్వే రితురాజ్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజాలు బరిలోకి దిగనున్నారు. ప్లేయర్‌గా ఆడుతున్నప్పుడు ధోనీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పాత్రలో ఉంటాడు.

తొలి మ్యాచ్‌లో మొయిన్ అలీ, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉండరు. ఈ పరిస్థితిలో యువ ఆల్‌రౌండర్లు రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, శివమ్ దూబేలకు అవకాశం దక్కవచ్చు. అదే సమయంలో, ఆడమ్ మిల్నే, మహిష్ తీక్షణ ఇతర బౌలింగ్ ఎంపికలలో అవకాశం దక్కొచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI:

రితురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్‌గేకర్, ఆడమ్ మిల్నే, మహిష్ తీక్షణ

కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో ఎవరుండనున్నారంటే?

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కూడా ఓపెనింగ్ జోడీ పెద్ద ప్రశ్నగానే మిగిలింది. వెంకటేష్ అయ్యర్‌తో సామ్ బిల్లింగ్స్ లేదా సునీల్ నరైన్ తెరకెక్కించవచ్చు. ఇది కాకుండా, మిడిల్ ఆర్డర్‌లో జట్టుకు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ బిగ్ హిట్టర్ ఆల్ రౌండర్‌గా ఉంటారు.

కేకేఆర్ మ్యాచ్ విన్నర్ ఆండ్రీ రస్సెల్ ప్లేయింగ్ XIలో ఖచ్చితంగా ఉంటాడు. బౌలర్లలో ఉమేష్ యాదవ్, శివమ్ మావి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండవచ్చు. అదే సమయంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా తుది 11లో ఉంటాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI:

వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

Also Read: CSK vs KKR, IPL 2022: ఆరంభంలో అదరగొట్టేది ఎవరు.. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే, కేకేఆర్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

IPL 2022: CSK vs KKR మ్యాచ్ కోసం ‘రెడ్’ పిచ్ సిద్ధం.. వాంఖడే మైదానంలో రికార్డులు ఎలా ఉన్నాయంటే?