18 ఏళ్లలో 11 టెస్టులు.. కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టిన భారత స్పిన్నర్.. ఆయనెవరో తెలుసా?

|

Jan 22, 2022 | 9:03 AM

భారతదేశానికి చెందిన ఈ దిగ్గజ స్పిన్నర్ ఆల్ రౌండర్‌గాను రాణించాడు. 600 కంటే ఎక్కువ వికెట్లు, 5 వేలకు పైగా పరుగులతో అతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌ అద్బుతంగా సాగింది.

18 ఏళ్లలో 11 టెస్టులు.. కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టిన భారత స్పిన్నర్.. ఆయనెవరో తెలుసా?
Cs Nayudu
Follow us on

Indian Cricket Team: స్పిన్ బౌలింగ్ ప్రస్తావన లేకుండా భారత క్రికెట్‌(Indian Cricket Team) లేదు. భారత క్రికెట్‌కు గొప్ప బలం దాని బ్యాటింగ్‌తోపాటు స్పిన్ బౌలింగ్ అనడంలో సందేహం లేదు. వినూ మన్కడ్ నుంచి బిషన్ సింగ్ బేడీ తరం నుంచి అనిల్ కుంబ్లే(Anil Kumble)-హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్-వీంద్ర జడేజా వంటి స్పిన్నర్లు భారత క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కానీ, ఇందులో కొంతమంది స్పిన్నర్లు అనుకున్నంతగా రాణించలేకపోయారు. తమ ప్రతిభకు తగ్గట్టుగా రాణించలేకపోయిన కొందరిలో స్పిన్నర్ సీఎస్ నాయుడు(CS Naidu) ఒకరుగా నిలిచారు. నేటి వీకెండ్ స్పెషల్‌లో ఆయన గురించి తెలుసుకుందాం.

భారత తొలి టెస్టు కెప్టెన్ సీకే నాయుడుకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అతని అద్భుతమైన కెరీర్ గురించి అందరికీ తెలుసు. కానీ, అతని సోదరుడు సిఎస్ నాయుడు కూడా భారత క్రికెట్‌లో భాగమయ్యాడు. కొట్టారి సుబ్బన్న నాయుడు ఆ స్పిన్నర్లతో సమానంగా పరిగణించారు. అతని ప్రతిభకు అంతా ఫిదా అయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా, సీఎస్ నాయుడు భారత తొలి టెస్టు జట్టులో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే, తన సోదరుడిలా మాత్రం విజయాలు అందుకోలేకపోయాడు. అయినా కొన్ని మ్యాచుల్లో తన ప్రత్యేకతో విజయాలు సాధించాడు.

19 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం..
సీఎస్ నాయుడు లెగ్ స్పిన్నర్‌గా రాణించాడు. ముఖ్యంగా తన గూగ్లీని ఎక్కువగా ఉపయోగించేవాడు. 1931లో కేవలం 17 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్‌లో అరంగేట్రం చేశాడు. నాయుడు నిజానికి మెరుగైన బ్యాట్స్‌మెన్. కానీ, అతను లెగ్ స్పిన్‌ను తన ఆయుధంగా చేసుకున్నాడు. ఈ కళను నేర్చుకోవడానికి, ఉపయోగించుకోవడానికి ఎంతో సమయాన్ని వెచ్చించాడు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ఆరంభాలను కలిగి ఉన్నాడు. సీఎస్ నాయుడు అటాకింగ్ బౌలింగ్ కారణంగా వికెట్లు పొందుతూనే ఉన్నాడు. దేశీయ క్రికెట్‌లో అతని మెరుగైన ప్రదర్శన, సీఎస్ నాయుడు సోదరుడు భారత కెప్టెన్‌గా ఉండటం వల్ల ప్రయోజనం పొందాడు. 19 సంవత్సరాల వయస్సులో అంటే 1934లో భారత్‌లో పర్యటించిన ఇంగ్లండ్‌పై కలకత్తాలో (ప్రస్తుతం కోల్‌కతా) టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు.

11 టెస్టులు ఆడి కేవలం 2 వికెట్లు..
నాయుడు రంజీ ట్రోఫీ నుంచి ఇతర ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల వరకు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కానీ, ఆ మ్యాజిక్‌ను టెస్టుల్లో పునరావృతం చేయలేకపోయాడు. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా వంటి జట్లలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ బ్యాట్స్‌మెన్స్ నాయుడు బౌలింగ్‌ను సులభంగా సద్వినియోగం చేసుకున్నారు. టెస్టు క్రికెట్‌లో అతను ఎప్పుడూ రాణించలేకపోవడానికి ఇదే కారణంగా నిలిచింది. అతని కెరీర్ 18 సంవత్సరాలు కొనసాగింది. 11 టెస్టులు ఆడాడు. ఈ సమయంలో నాయుడు కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

లాంగ్ స్పెల్స్ నాయుడు ప్రత్యేకత..
టెస్ట్ క్రికెట్ విజయాన్ని అందించకపోవచ్చు. కానీ, ఫస్ట్ క్లాస్ కెరీర్ అద్భుతంగా సాగింది. లాంగ్ స్పెల్స్‌లో నిలకడగా బౌలింగ్ చేయడం నాయుడు ప్రత్యేకత. ఈ క్వాలిటీ కారణంగానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్వితీయ రికార్డు సృష్టించాడు. 1944-45 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో హోల్కర్ జట్టు తరపున ఆడిన నాయుడు, బొంబాయికి వ్యతిరేకంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 152.5 ఓవర్లు అంటే 917 బంతులు వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 64.5 ఓవర్లలో 153 పరుగులకు 6 వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 275 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. నాయుడు విసిరిన 917 బంతులు ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అత్యధిక బంతులు ఆడిన రికార్డుగా నిలిచింది.

ఆల్ రౌండర్ పాత్రతో అదరగొట్టాడు..
నాయుడు దేశీయ రికార్డు అద్భుతంగా ఉంది. తన రంజీ కెరీర్‌లో మొత్తం 295 వికెట్లు తీశాడు. ఇది 1970-71 వరకు రికార్డుగా నిలిచింది. నాయుడు తన లెగ్ స్పిన్‌తో అద్భుతాలు చేయడమే కాకుండా, బ్యాటింగ్‌లో కూడా కీలకమని నిరూపించుకున్నాడు. తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో మొత్తం 174 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 647 వికెట్లు తీసుకున్నాడు. 23.90 సగటుతో 5786 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read: Sudhir Kumar Chaudhary: సచిన్ టెండూల్కర్‌‌ వీరాభిమానిపై పోలీసుల దాడి..!

IPL 2022: లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఫిక్స్.. రిటైన్ లిస్టులో మరో ఇద్దరు ఎవరంటే?