
ప్రపంచంలోనే గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ ఫిట్టెస్ట్ ప్లేయర్ అంటే.. ఎవ్వరైనా చెప్పేది ఒక్కటే పేరు.. క్రిస్టియానో రొనాల్డో. ఈ పోర్చుగల్ లెజెండ్రీ ప్లేయర్. తన చివరి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడేశాడు. ఫిఫా వరల్డ్ కప్‌లో నిన్న మొరాకోతో జరిగిన క్వార్టర్స్‌లో పోర్చుగల్ ఓటమిపాలైంది. ఆ జట్టు ఒక్కగోల్ కూడా చేయలేకపోయింది. ఒక్క ప్రపంచకప్ అయినా సాధించాలన్న అతడి కల చెదిరిపోయింది. మొరాకో వంటి జట్టుచేతిలో ఓటమితో.. పోర్చుగల్ అవమానకరరీతిలో వైదొలగింది. గత మ్యాచ్‌లో రొనాల్డో బెంచ్‌కే పరిమితం అవ్వగా.. ఈ పోరులో జట్టు కోచ్ అతడిని మధ్యలో దించాడు. కాని రొనాల్డో మ్యాజిక్ పనిచేయలేదు. మ్యాచ్ ముగిసేసరికి 1-0తో మొరాకో గెలవడంతో.. గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. కన్నీరు పెట్టుకున్నాడు. వెక్కివెక్కి ఏడ్చాడు.
దీనికి కారణం ఉంది. పోర్చుగల్ ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలవలేదు. గత నాలుగు వరల్డ్ కప్స్‌లో రొనాల్డో ఆడినా.. అతడికి జట్టు సరిగా సహకరించలేదు. ఈసారి జట్టు సహకరించినా.. రొనాల్డో ఆడలేకపోయాడు. ఆ మ్యాజిక్ చూపించలేకపోయాడు. కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన రోనాల్డో పెర్ఫామెన్స్ అంతంతమాత్రంగానే నిలిచింది. పోర్చుగల్ ఈ వరల్డ్ కప్‌లో ఫేవరెట్‌గా నిలిచినా.. రొనాల్డో మ్యాజిక్ మాత్రం పనిచేయలేదు. రొనాల్డో మరో ప్రపంచకప్ ఆడే అవకాశాలు లేవు. దీంతో పోర్చుగల్ ఓటమి.. ఆతర్వాత అతడి కన్నీరు అభిమానుల మనసునీ పిండేసింది. రొనాల్డో ఏడుస్తుంటే తట్టుకోలేకపోయారు. ఓ వీరుడి ఇంటర్నేషనల్ స్టోరీ ఇలా ముగియడం బాధాకరమే.
#ronaldo #WorldCup2022 #CR7? @Cristiano pic.twitter.com/jrj1dkq2wL
— salmanshaikh.777 (@777Salmanshaikh) December 10, 2022
పోర్చుగల్ నుంచి హీరోలు రావొచ్చుగాని… మరో రొనాల్డో రాలేడన్నది వాస్తవం. పోర్చుగల్ తరఫున 195 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో 118 గోల్స్ కొట్టాడు. కాగా క్రిస్టియానో రొనాల్డోకు సెండాఫ్ చెబుతూ ఫిఫా ట్విటర్‌లో థాంక్యూ అని సందేశాన్ని ఉంచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..