Team India: అందంలోనే కాదు.. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతోనూ సంచలనమే.. ఈ క్రికెటర్ భార్య ఎవరో తెలుసా?

|

Feb 25, 2023 | 5:57 PM

భారతదేశపు స్టార్ స్క్వాష్ క్రీడాకారిణిగా పేరుగాంచిన ఈ క్రికెటర్ భార్య.. భారత్‌కు పలు ఈవెంట్లలో పతకాలు సాధించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటింది.

1 / 8
దీపిక పల్లికల్ భారతదేశపు ప్రసిద్ధ స్క్వాష్ క్రీడాకారిణిగా పేరుగాంచింది. దీపిక భారత్‌కు పలు ఈవెంట్లలో పతకాలు సాధించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో దీపిక భారత్‌కు పతకాలు అందించింది.

2 / 8
దీపికా పల్లికల్ భారతదేశంలోని అత్యుత్తమ స్క్వాష్ క్రీడాకారిణులలో ఒకరనే విషయం తెలిసిందే. కాగా, దీపిక క్రీడా కుటుంబానికి చెందినది. ఆమె తల్లి సుసాన్ ఇటిచెరియా భారత జట్టు తరపున వన్డే, టెస్ట్ క్రికెట్ ఆడింది.

3 / 8
ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (PSA) మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశించిన మొదటి భారతీయురాలుగా దీపిక నిలిచింది. దీపిక తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. దీపిక 2006 నుంచి తన కెరీర్‌ను ప్రారంభించింది. 2011లో కాలిఫోర్నియాలోని ఇర్విన్‌లో జరిగిన ఆరెంజ్ కౌంటీ ఓపెన్‌ని గెలుచుకోవడం ద్వారా తన మొదటి మేజర్ టైటిల్‌ను గెలుచుకుంది.

4 / 8
2012లో న్యూయార్క్‌లో జరిగిన ఛాంపియన్స్ స్క్వాష్ మీట్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలిగా దీపిక నిలిచింది. దీపిక్ తన కెరీర్ ప్రారంభం నుంచి భారత ప్రధాన ప్లేయర్‌గా మారింది.

5 / 8
దీపిక 2015 ఆగస్టులో భారత క్రికెటర్ దినేష్ కార్తీక్‌ను వివాహం చేసుకుంది. దీపికను దినేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కార్తీక్ తన భార్య నికితా వంజారాకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు దీపికకు క్రికెట్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు.

6 / 8
వీరిద్దరి భేటీ చాలా అపూర్వంగా జరిగింది. దీపిక, కార్తీక్ ఇద్దరూ ఒకే కోచ్ వద్ద ఫిట్‌నెస్ కోచింగ్ తీసుకునేవారు. ఆ సమయంలో వారిద్దరూ కలుసుకున్నారు. కార్తీక్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత దీపికకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత వారిద్దరూ 2015 ఆగస్టు 18న పెళ్లి చేసుకున్నారు.

7 / 8
కార్తీక్, దీపిక రెండు విధాలుగా వివాహం చేసుకున్నారు. మొదట హిందూ ఆచారంలో, రెండోసారి క్రైస్తవ ఆచారంలో చేసుకున్నారు. మొదట్లో కార్తీక్ ఆట కారణంగా దీపికకు అంతగా నచ్చలేదు.

8 / 8
కార్తీక్ మొదటి భార్య నిఖిత వంజరతో చాలా ఇబ్బందులు పడ్డాడు. కార్తీక్ తోటి క్రికెటర్ మురళీ విజయ్‌తో నిఖిత ప్రేమ వ్యవహారం నడిపించడంతో, కార్తీక్, నిఖితల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో కార్తీక్ చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఆ సమయంలోనే దీపికా పల్లికల్ పరిచయం అవ్వడంతో.. కార్తీక్ మరలా క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు.