సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థులకు చుక్కలు..! ఒంటి చేత్తో మ్యాచ్‌ గెలిపించిన కరేబియన్ ఆల్‌ రౌండర్..

|

Sep 04, 2021 | 7:34 PM

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ మ్యాచ్‌లు ఐపీఎల్‌ని తలపిస్తున్నాయి. తాజాగా ఓ కరేబియన్ ఆల్‌రౌండర్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఆల్‌ రౌండర్ ప్రతిభతో

సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థులకు చుక్కలు..! ఒంటి చేత్తో మ్యాచ్‌ గెలిపించిన కరేబియన్ ఆల్‌ రౌండర్..
Roston Chase
Follow us on

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ మ్యాచ్‌లు ఐపీఎల్‌ని తలపిస్తున్నాయి. తాజాగా ఓ కరేబియన్ ఆల్‌రౌండర్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఆల్‌ రౌండర్ ప్రతిభతో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 29 సంవత్సరాల ఈ మ్యాచ్ విన్నర్ పేరు రోస్టన్ చేజ్. ఇతడు సెయింట్ లూసియా కింగ్స్ జట్టు ప్లేయర్. తాజాగా సెయింట్ లూసియా వర్సెస్‌ గయానా వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోస్టన్ చేజ్ విధ్వంసం సృష్టంచాడు. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రెండు ఓవర్లకే 2 పెద్ద వికెట్లు కోల్పోయింది. ఆండ్రీ ఫ్లెచర్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ పరుగులేమి చేయకుండా ఔట్ అయ్యారు. దీంతో క్రీజులోకి వచ్చిన రోస్టన్ చేజ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మూడో వికెట్ కోసం చేజ్ మార్క్, దయాళ్‌తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తర్వాత మార్క్ అవుట్ అయ్యాడు కానీ చేజ్ విధ్వంసం అలాగే కొనసాగింది.

రోస్టన్ చేజ్ ఆల్‌ రౌండర్ ప్రతిభ
రోస్టన్ చేజ్ 50 బంతులు ఎదుర్కొని 85 పరుగులు చేశాడు. ఇందులో అతను మొత్తం 13 బౌండరీలు సాధించాడు 7 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. అంటే కేవలం13 బంతుల్లో 500 స్ట్రైక్ రేట్‌తో 66 పరుగులు చేశాడు. చేజ్ ఈ తుఫాను ఇన్నింగ్స్ ఫలితంగా సెయింట్ లూసియా జట్టు 149 పరుగులు చేయగలిగింది.

గయానా వారియర్స్ 98 పరుగులకే ఆలౌట్
గయానా వారియర్స్‌కి 20 ఓవర్లలో 150 పరుగులు చేయడం సవాలుగా మారింది. సెయింట్ లూసియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వారించారు. ఫలితంగా గయానా వారియర్స్ జట్టు 98 పరుగులకే కుప్పకూలింది. 51 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. కెప్టెన్ నికోలస్ పూరన్ అత్యధికంగా 41 పరుగులు చేశాడు. అదే సమయంలో సెయింట్ లూసియా జట్టు నుంచి జ్యూవెలర్ రాయల్ 3 వికెట్లు సాధించాడు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన రోస్టన్ చేజ్ బంతితో కూడా రాణించాడు. 3 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి1 వికెట్ సాధించాడు. ఆల్‌రౌండర్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

 

CM KCR: కొత్త ఐపీఎస్‌లను కేటాయించండి: హోం మంత్రి అమిత్‌షాకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

Karthikeya 2: ఒక్క పోస్టర్‌తోనే ఇంత బిజినెస్ జరిగిందా..? భారీ ధరకు కార్తికేయ 2 శాటిలైట్ రైట్స్..

TDS: మీకు టీడీఎస్ కట్ అయినదీ లేనిదీ ఇలా తెలుసుకోవచ్చు.. పాన్ కార్డు ద్వారా మీరు మీ టీడీఎస్ సొమ్ము తిరిగి పొందడం ఇలా..