Afghanistan Cricket Team: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణ తర్వాత దేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది. విదేశీ పౌరులు, అధికారులు, చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు కూడా దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం తాలిబన్ పాలన శకం ప్రారంభమైంది. సాధారణ జీవితంతో పాటు, దేశంలో క్రీడల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. గత దశాబ్దంలో ఈ దేశానికి క్రీడలతో మంచి గుర్తింపు లభించింది. తాలిబన్ ఉన్నతాధికారులు పురుషుల క్రికెట్ జట్టుకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియాతో ఆఫ్ఘనిస్తాన్ ఆడే ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తానని ప్రకటించింది. దీనికి కారణం తాలిబన్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయమేనంటూ పేర్కొంది.
క్రికెట్‌కు మద్దతు ఇవ్వడం గురించి తాలిబన్‌లు మాట్లాడుతూ.. ‘పురుషుల క్రికెట్ జట్టును మాత్రమే ఆడేందుకు అనుమతిస్తామని, మహిళా జట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని’ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియన్ ఛానల్ ఎస్‌బీఎస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాలిబన్ నాయకుడు మాట్లాడుతూ, మహిళలకు క్రికెట్ అవసరం లేదని, అందుకే మేం మహిళలు క్రికెట్ ఆడేందుకు అనుమతించమని తెలిపాడు. ఇది మాత్రమే కాదు, దేశంలో క్రీడలు లేదా వినోదాలకు సంబంధించిన రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని నిషేధించాలని తాలిబన్ నిర్ణయించింది. ఇస్లాం మతం షరియా చట్టం ప్రకారం, మహిళలు శరీరం కనిపించే ఏలాంటి కార్యకలాపాలలోనూ పాల్గొనడానికి అనుమతించదని పేర్కొన్నారు.
టెస్ట్ మ్యాచ్ రద్దు..?
తాలిబన్ల నిర్ణయంతో దేశంలో మహిళా క్రీడలపై ఆందోళన నెలకొంది. దీంతో పురుషుల క్రికెట్ జట్టు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. ఈ జట్టుకు ఆస్ట్రేలియా నుంచి ప్రమాదం వచ్చి పడింది. ఆస్ట్రేలియా ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ మ్యాచ్ రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన విడుదల చేసింది. “ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల క్రికెట్‌కు మద్దతు ఇవ్వలేదనే మీడియా నివేదికలు నిజమైతే, హోబర్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం కుదరదని” పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్ 3 సంవత్సరాల క్రితమే ఐసీసీ నుంచి పూర్తి సభ్యత్వ హోదా పొందింది. దీంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అనుమతి వచ్చింది. 2018 లో టీమిండియాతో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, పూర్తి సభ్య దేశాలు పురుషుల బృందంతో పాటు మహిళా క్రికెట్ జట్టును కూడా సిద్ధం చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ బోర్డ్ గత ఏడాది మాత్రమే మహిళా క్రికెట్ జట్టుకు కేంద్ర కాంట్రాక్టును ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత దేశంలో మహిళల క్రికెట్‌లో పలు మార్పులు వచ్చాయి. కానీ, ప్రస్తుత పరిణామాల తరువాత, ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టు టెస్ట్ హోదాను కూడా ఉపసంహరించే ముప్పు పొంచి ఉంది.
An update on the proposed Test match against Afghanistan ⬇️ pic.twitter.com/p2q5LOJMlw
— Cricket Australia (@CricketAus) September 9, 2021
CPL: చెత్త ఫీల్డింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లు వీరేనేమో.. కామెంట్లతో ఏకిపారేస్తోన్న నెటిజన్లు