T20 World Cup: ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా కొత్త జెర్సీ.. సంక్రాంతి ముగ్గును తలపిస్తోందంటోన్న ఫ్యాన్స్‌

|

Sep 14, 2022 | 3:26 PM

Australia Cricket: అక్టోబర్‌ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పెద్ద జట్లన్నీ తమ స్వ్కాడ్‌ను ప్రకటించాయి. ఇక గతేడాది దుబాయ్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయిన సంగతి తెలిసింది.

T20 World Cup: ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా కొత్త జెర్సీ.. సంక్రాంతి ముగ్గును తలపిస్తోందంటోన్న ఫ్యాన్స్‌
Australia Cricket Jersey
Follow us on

Australia Cricket: అక్టోబర్‌ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పెద్ద జట్లన్నీ తమ స్వ్కాడ్‌ను ప్రకటించాయి. ఇక గతేడాది దుబాయ్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయిన సంగతి తెలిసింది. ఎలాంటి అంచానాలు లేకుండా బరిలోకి దిగిన కంగారూలు అద్భుతమైన ఆటతీరుతో టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో డిపెండింగ్‌ ఛాంపియన్‌గా ఆసీస్‌ బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే ఆరోన్‌ ఫించ్‌ నాయకత్వంలోని తమ జట్టును ప్రకటించింది. తాజాగా ప్రపంచకప్‌ కోసం సరికొత్తగా డిజైన్‌ చేయించిన సరికొత్త జెర్సీని ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు విడుదల చేసింది. బ్లాక్ అండ్ యెల్లో కాంబినేషన్ కనిపిస్తోన్న ఈ జెర్సీపై కుడి వైపు ఆస్ట్రేలియా సింబల్, ఎడమవైపు టీ20 ప్రపంచ కప్ 2022 గుర్తు, మధ్యలో ఆస్ట్రేలియా అని ఇంగ్లిషులో రాసి ఉంది. ఇక జెర్సీ కింది భాగంలో గ్రీన్, గోల్డ్ కాంబినేషన్ లో ఆర్ట్ వర్క్ ఉంది.

కాగా తమ జట్టుకోసం తొలిసారిగా స్వదేశీ నేపథ్యమున్న జెర్సీని రూపొందించింది ఆస్ట్రేలియా. ఈ జెర్సీని ఆంటీ ఫియోనా క్లార్క్, కోర్ట్నీ హెగెన్ రూపొందించినట్లు ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. జెర్సీకి సంబంధించిన విషయాలను తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ ‘ టీ 20 ప్రపంచకప్‌ కోసం కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. కాగా క్రికెట్‌ ఆస్ట్రేలియా విడుదల చేసిన జెర్సీపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇదేంది ఆస్ట్రేలియా కొత్త జెర్సీలోని డిజైన్‌ సంక్రాంతి ముగ్గును తలపిస్తోంది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..