India vs New Zealand: టెస్ట్ జట్టు కెప్టెన్సీ పోటీలో ఆ ఇద్దరూ.. న్యూజిలాండ్ సిరీస్‌తో తేల్చనున్న బీసీసీఐ..!

|

Nov 11, 2021 | 1:50 PM

Rohit Sharma vs Ajinkya Rahane: ఈ టోర్నీ తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌కు ముందే చెప్పాడు. అతని స్థానంలో రోహిత్‌ని టీ20 జట్టు కెప్టెన్‌గా నియమించారు.

India vs New Zealand: టెస్ట్ జట్టు కెప్టెన్సీ పోటీలో ఆ ఇద్దరూ.. న్యూజిలాండ్ సిరీస్‌తో తేల్చనున్న బీసీసీఐ..!
India Vs Newzealand, Rohit Sharma And Rahane
Follow us on

Rohit Sharma vs Ajinkya Rahane: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌ స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20, టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. టీ20 సిరీస్‌కు టీమిండియా ఎంపికైంది. ఈ టీమ్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు టెస్టు జట్టు కెప్టెన్సీ రేసులోనూ రోహిత్ శర్మ మరో ప్లేయర్ అజింక్యా రహానేకి సవాల్ విసురుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఎవరు వ్యవహరించాలనే దానిపై రోహిత్, రహానేల మధ్య వార్ నడుస్తోంది. కాన్పూర్‌లో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఈ ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్సీని విరాట్ వదులుకోవడంతో తాజాగా రోహిత్‌కి టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వన్డే జట్టు కమాండ్‌ని కూడా రోహిత్‌కే అప్పగించవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో టెస్టులో కోహ్లి గైర్హాజరీలో జట్టు బాధ్యతలు చేపట్టేటప్పుడు రహానే కూడా ముందు వరుసలో ఉంటాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత కోహ్లీ తిరిగి భారతదేశానికి వచ్చాడు. మిగిలిన మ్యాచ్‌లలో రహానే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సిరీస్‌ను కూడా గెలుచుకున్నాడు. అందుకే రేసులో ఉంటాడు. దీంతో రోహిత్ వర్సెస్ రహానెకు మధ్య కెప్టెన్సీ విషయంలో సెలక్టర్లు అయోమయంలో పడ్డారు. ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టులో కోహ్లీ పునరాగమనం చేయనున్నాడు. కోహ్లీ పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రహానేతోనే కెప్టెన్సీని నడిపించేదుకు సెలక్టర్లు సానుకూలంగా ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి.

విశ్రాంతిలో ఉండే ఆటగాళ్లు..
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021లో భారత జట్టు ప్రదర్శన పేలవంగా తయారైంది. దీంతో ఆ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. దీని తరువాత అప్పటి జట్టు కోచ్, రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరంతరం బయో బబుల్‌లో ఉండడంతో ఆటగాళ్ల ప్రదర్శనను ప్రభావితం చేసింది. అందువల్ల బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించినప్పుడు, చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. టెస్టు సిరిస్‌లో కూడా అదే కనిపిస్తుంది. టెస్టు సిరీస్‌లో కూడా కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తోంది. విశ్రాంతి తీసుకోగల ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ పేర్లు ఉండవచ్చు.

పంత్ స్థానంలో సాహా!
వీరితో పాటు వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా నిరంతరం క్రికెట్ ఆడుతున్నందున అతనికి కూడా విశ్రాంతి ఇవ్వవచ్చు. పంత్ IPL-2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ పర్యటనలో కూడా జట్టుతో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. సెలెక్టర్లు పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాను తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే రెండో వికెట్ కీపర్ రౌండ్‌లో కేఎస్ భరత్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.

Also Read: T20 World Cup 2021: సెమీఫైనల్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం!

Sanju Samson Birthday: ప్రతిభ ఫుల్.. అదృష్టం మాత్రం నిల్.. ఐపీఎల్‌లో హిట్టయినా.. టీమిండియాలో జీరోగా మారిన కేరళ స్టార్ ప్లేయర్..!