IND vs SL: “ఎలా ఆడాలో కోచ్ చెప్పలేదు.. తలకు బంతి తగలడంతో ఏకాగ్రత పట్టు తప్పింది”

|

Jul 19, 2021 | 7:11 AM

ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా కుర్రాళ్లు ఇరగదీశారు. ఓపెనర్ పృథ్వీ షా, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడడంతో.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆడుతూ పాడుతూ విజయం సాధించింది.

IND vs SL: ఎలా ఆడాలో కోచ్ చెప్పలేదు.. తలకు బంతి తగలడంతో ఏకాగ్రత పట్టు తప్పింది
Prithvi Shaw
Follow us on

IND vs SL: ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా కుర్రాళ్లు ఇరగదీశారు. ఓపెనర్ పృథ్వీ షా, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడడంతో.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. అయితే, మంచి ఫాంలో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా.. 43 పరుగుల వద్ద ఉన్నప్పుడు తలకు బలంగా బాల్ తాకంది. దీంతో ఏకగ్రతను కోల్పోయినట్లు ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ వెల్లడించాడు. దాంతోనే అనంతరం వెంటనే ఔటయ్యాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా.. దారుణంగా విఫలమయ్యాడు. దాంతో టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది. అలాగే ఇంగ్లండ్ పర్యటనకు సెలక్ట్ చేయలేదు. దాంతో తన బ్యాటింగ్‌లోని తప్పులను సరిదిద్దుకుని దేశవాళీ, ఐపీఎల్‌లో రాణించాడు. దీంతో శ్రీలంక పర్యటనకు సెలక్ట్ అయ్యాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం.. 50 ఓవర్లకు 263 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ పృథ్వీ షా(43 పరుగులు; 24 బంతులు, 9 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌ (86 నాటౌట్‌; 95 బంతులు, 6ఫోర్లు, 1సిక్స్) ఓపెనింగ్‌గా బరిలోకి దిగారు. ఓపెనర్ పృథ్వీ తొలి ఓవర్‌ నుంచే లంక బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఓవర్‌కు రెండు ఫోర్ల చొప్పున కొడుతూ దూకుడు పెంచాడు. క్రీజులో కొద్దిసేపే ఉన్నా.. బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే ఐదో ఓవర్లో చమీరా బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్లో చివరి బంతి పృథ్వీ హెల్మెట్‌కు గట్టిగా తాకింది. దాంతో హెల్మెట్‌ కొద్దిగా విరిగిపోయింది. ఆ వెంటనే ఫిజియో వచ్చి పర్వాలేదనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపై బ్యాటింగ్‌ కొనసాగించిన పృథ్వీ.. తరువాతి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. ధనంజయ వేసిన బాల్‌ను భారీ షాట్ కొట్టబోయి.. అవిష్క ఫెర్నాండో క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు.

అద్భుత ఆరంభం ఇచ్చిన ఓపెనర్ పృథ్వీషా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సర్ ఏమీ చెప్పలేదు. నాచురల్‌గానే ఆడాను. స్కోర్‌ బోర్డును పరిగెత్తించాలని అనిపించింది. దాంతో చెత్త బంతులపై వేట కొనసాగించాను. అలాగే పిచ్‌ కూడా బాగా హెల్స్ చేసింది. లంక పేస్‌ బౌలింగ్‌ను బాగా ఎంజాయ్ చేశానని, చమీరా వేసిన బంతి తలకు తగిలింది. అప్పుడే నా ఏకాగ్రతపై పట్టు తప్పానని ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ చెప్పుకొచ్చాడు.

Also Read:

IND vs SL 1st ODI: తొలి వన్డే మనదే.. శ్రీలంకపై భారత్‌ ఘన విజయం.. దుమ్ము లేపిన యువ ఆటగాళ్లు.

Tokyo Olympics 2021: వెయిట్ లిఫ్టింగ్‌లో 20 ఏళ్ల నిరీక్షణకు అడ్డుకట్టపడేనా? భారీ అంచనాలతో మీరాబాయి చాను బరిలోకి!