Indian Test Team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన టీ20 లీగ్. ముఖ్యంగా భారత్‌కి ఎందరో క్రికెటర్లను అందించిన క్రికెట్ టోర్నమెంట్. అయితే ఇప్పుడు ఈ ‘ఐపీఎల్‌లో రాణించినవారికి వైట్ బాల్ ప్లేయర్లుగా అవకాశం సరే. టెస్టులకు కూడా ఇదే ప్రమాణికమా..?’ అంటూ పలువురు మాజీలు బీసీసీఐ మీద మండిపడుతున్నారు. ముఖ్యంగా వెస్టిండీస్ టూర్ కోసం డొమెస్టిక్ క్రికెటర్లయిన సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యూ ఈశ్వరన్ వంటి వారిని తీసుకోకపోగా.. నయా వాల్‌గా ప్రసిద్ధి చెందిన చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ఆటగాళ్లను తొలగించిన నేపథ్యంలో ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా టీమిండియా టెస్ట్ ప్లేయర్ అభినవ్ ముకుంద్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.
‘ఈ ఎంపికలను అర్థం చేసుకోలేకపోతున్నాను. ట్వీట్ చేయడానికి నా తలలో చాలా ఆలోచనలు ఉన్నాయి. అయితే ఒక యువ ఆటగాడికి ఇకపై తన రాష్ట్రం తరఫున ఆడటం గర్వంగా భావించే ప్రోత్సాహం ఎక్కడ..? ఫ్రాంచైజీ క్రికెట్ ఆడడమే సరైన మార్గం #INDvsWI’ అని ముకుంద్ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ నెట్టంట తెగ వైరల్ అవుతోంది. ముకుంద్ కంటే ముందు టీమిండియా మాజీలు సునీల్ గవాస్కర్, ఆకాశ్ చోప్రా, హర్భజన్ సింగ్ వంటివారు కూడా ఈ విషయంపై స్పందించారు. టీ20 క్రికెట్‌లో ఆడినవారినే టెస్టుల్లోకి తీసుకునేలా అయితే రంజీ ట్రోఫీని ఆపేయండి అంటూ సునీల్ అనగా.. 100 టెస్టులు ఆడిన చతేశ్వర్ పుజరాను ఒక్క మ్యాచ్ ఆధారంగా తీసేయడం దౌర్భాగ్యం అని భజ్జీ అన్నాడు.
Unable to understand these selections- too many thoughts in my head to compile into a tweet. But what is the incentive for a young player to take pride in playing for his state anymore? Clearly the franchise route is a faster way to scale the grade. #INDvsWI
— Abhinav Mukund (@mukundabhinav) June 23, 2023
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ సిరాజ్ , ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..