CSK vs KKR Highlights, IPL 2021: ఉత్కంఠ పోరులో ధోని సేనదే విజయం.. ఓపెనర్ల జోరుకు తోడైన జడేజా తుఫాన్ ఇన్నింగ్స్‌

| Edited By: Ravi Kiran

Sep 26, 2021 | 7:37 PM

CSK vs KKR Highlights in Telugu: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి కోల్‌కతా నైట్ రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

CSK vs KKR Highlights, IPL 2021: ఉత్కంఠ పోరులో  ధోని సేనదే విజయం.. ఓపెనర్ల జోరుకు తోడైన జడేజా తుఫాన్ ఇన్నింగ్స్‌
Ipl 2021, Rcb Vs Mi

CSK vs KKR Highlights in Telugu: అబుదాబిలో నేడు ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో భాగంగా 38వ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరగులు సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

అబుదాబిలో నేడు ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో భాగంగా 38వ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అయితే ఇక్కడ ఇది వరకు ఆడిన రెండు మ్యాచుల్లో చెరో విజయం సాధించిన నేపథ్యంలో నేటి పోటీ చాలా హోరాహోరీగా ఉండబోతోంది. అయితే రెండో దశలో ఇప్పటి వరకు చెరో రెండు మ్యాచులు ఆడి రెండింట్లోనూ విజయం సాధించడం విశేషం.

ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలు 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 16, కోల్‌కతా నైట్ రైడర్స్ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. యూఏఈలో ఇప్పటి వరకు ఆడిన మ్యాచులను పరిశీలిస్తే.. ఇరు జట్లు 2 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలు తలో మ్యాచులో గెలిచాయి.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI అంచనా : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI అంచనా: శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Sep 2021 07:31 PM (IST)

    చెన్నైదే విజయం

    ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్లో నాటకీయ పరిణాలు చోటుచేసుకోవడంతో ఎంతో ఉత్కంఠ రేకెత్తింది. ఓ దశలో ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌కు చేరుకుంటుందా అనే పరిస్థికి చేరుకుంది. కానీ, చివరి బంతికి పరుగు తీసి ధోని సేనే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • 26 Sep 2021 07:22 PM (IST)

    7వ వికెట్ కోల్పోయిన చెన్నై

    కుర్రాన్ (4) రూపంలో చెన్నై టీం ఏడో వికెట్‌ను కోల్పోయింది.


  • 26 Sep 2021 06:48 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన చెన్నై

    రాయుడు (10) రూపంలో చెన్నై టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 119 వద్ద బౌల్డయ్యాడు.

  • 26 Sep 2021 06:38 PM (IST)

    రెండు వికెట్ కోల్పోయిన చెన్నై

    డుప్లిసిస్ (43 పరుగులు, 30 బంతులు, 7 ఫోర్లు) రూపంలో చెన్నై టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. ప్రసీద్ద్ బౌలింగ్‌లో టీం స్కోర్ 102 వద్ద ఫెర్గ్యూసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 26 Sep 2021 06:26 PM (IST)

    10 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్ 89/1

    చెన్నై సూపర్ కింగ్స్ టీం 10 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది. క్రీజులో డుప్లిసిస్ 37, అలీ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 06:16 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

    రుతురాజ్ (40 పరుగులు, 28 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో చెన్నై టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. రస్సెల్ బౌలింగ్‌లో టీం స్కోర్ 74 వద్ద మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 26 Sep 2021 06:05 PM (IST)

    6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్ 52/0

    చెన్నై టీం 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 23, డుప్లిసిస్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 05:54 PM (IST)

    4 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్ 28/0

    చెన్నై టీం 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 9, డుప్లిసిస్ 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 05:51 PM (IST)

    3 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్ 18/0

    సీఎస్‌కే టీం 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 8, డుప్లిసిస్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 05:39 PM (IST)

    మొదలైన చెన్నై ఛేజింగ్

    172 పరుగుల లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్‌ టీం ఛేజింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా రుతురాజ్, డుప్లిసిస్ బరిలోకి దిగారు.

  • 26 Sep 2021 05:24 PM (IST)

    చెన్నై టార్గెట్ 172

    టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి కోల్‌కతా నైట్ రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

  • 26 Sep 2021 05:20 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    దినేష్ కార్తీక్ (26) రూపంలో కోల్‌కతా టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. హజల్‌వుడ్ బౌలింగ్‌లో టీం స్కోర్ 166 వద్ద ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 26 Sep 2021 05:08 PM (IST)

    18 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 139/5

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 18 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. క్రీజులో రాణా 31, కార్తీక్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 05:01 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    అండ్రూ రస్సెల్ (20) రూపంలో కోల్‌కతా టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. శార్దుల్ బౌలింగ్‌లో టీం స్కోర్ 125 వద్ద బౌల్డయ్యాడు.

  • 26 Sep 2021 04:44 PM (IST)

    14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 104/4

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. క్రీజులో రాణా 16, రస్సెల్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 04:37 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    త్రిపాఠి (45) రూపంలో కోల్‌కతా టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో టీం స్కోర్ 89 వద్ద బౌల్డయ్యాడు.

  • 26 Sep 2021 04:31 PM (IST)

    ఈ క్యాలెండర్ సంవత్సరంలో టీ 20 ల్లో ఇయోన్ మోర్గాన్ స్టాట్స్

    28 ఇన్నింగ్స్‌లు
    473 పరుగులు
    సగటు 18.19
    స్ట్రైక్ రేట్ 122.54
    అత్యధిక స్కోర్ 47*

  • 26 Sep 2021 04:29 PM (IST)

    11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 84/3

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. క్రీజులో త్రిపాఠి 43, రాణా 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 04:23 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    మోర్గాన్ (8) రూపంలో కోల్‌కతా టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. హజల్‌వుడ్ బౌలింగ్‌లో డుప్లిసిస్‌ క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 70 వద్ద పెవిలియన్ చేరాడు.

  • 26 Sep 2021 04:17 PM (IST)

    9 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 70/2

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 9 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో త్రిపాఠి 33, మోర్గాన్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 04:09 PM (IST)

    7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 55/2

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 7 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. క్రీజులో త్రిపాఠి 23, మోర్గాన్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 04:02 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    వెంకటేష్ అయ్యార్ (18) రూపంలో కోల్‌కతా టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. శార్దుల్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 50 వద్ద పెవిలియన్ చేరాడు. మొత్తానికి ధోని సేన తొలి పవర్ ప్లేలో కేకేఆర్‌పై అలాగే వెంకటేష్ అయ్యర్‌పై పూర్తి ఆధిప్యతం చూపించింది.

  • 26 Sep 2021 03:55 PM (IST)

    ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్

    ఓటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్ త్రిపాఠి.. అది నోబాల్‌ కావడంతో కేకేఆర్‌కి పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఆ తరువాత బాల్‌ను సిక్సర్‌ కొట్టి ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్‌ను అందించాడు.

  • 26 Sep 2021 03:49 PM (IST)

    3 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 26/1

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 8, త్రిపాఠి 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Sep 2021 03:40 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    శుభ్మన్ గిల్ (9) రూపంలో కోల్‌కతా టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. చాహర్ బౌలింగ్‌లో అనవసర పరుగుకు ప్రయత్నించి రాయుడు వేసిన అద్భుతమైన త్రోకు రన్ ఔట్ అయ్యాడు.

  • 26 Sep 2021 03:34 PM (IST)

    తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలు

    చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే శు‌భ‌్మన్ గిల్ వరుసగా రెండు ఫోర్లు బాదేశాడు. దీంతో తొలి ఓవర్‌లో 4 బంతులు ముగిసే సరికి కేకేఆర్ టీం 10 పరుగులు చేసింది.

  • 26 Sep 2021 03:33 PM (IST)

    మొదలైన బ్యాటింగ్

    టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలు పెట్టింది కోల్‌కతా నైట్ రైడర్స్ టీం. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ బరిలోకి దిగారు.

  • 26 Sep 2021 03:07 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవన్

    చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుభ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చాకరవర్తి, ప్రసిద్ కృష్ణ

  • 26 Sep 2021 03:04 PM (IST)

    టాస్ గెలిచిన కోల్‌కతా

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ధోని సేన తొలుత బౌలింగ్ చేయనుంది.

  • 26 Sep 2021 02:38 PM (IST)

    మరికొద్దిసేపట్లో టాస్

Follow us on