CSK New Title Sponsor : ఐపీఎల్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు టైటిల్​స్పాన్సర్‌గా ‘స్కోడా’..

ఐపీఎల్​లో  చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్ వచ్చింది. ఇంతకాలం చెన్నై జట్టుకు టైటిల్​ స్పాన్సర్​గా వ్యవహరిస్తున్న ముత్తూట్​ ఫైనాన్స్​ గ్రూప్​ గడువు కాలం ముగిసింది. దీంతో ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ కంపెనీ స్కోడాతో..

CSK New Title Sponsor : ఐపీఎల్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు టైటిల్​స్పాన్సర్‌గా స్కోడా..

Updated on: Feb 03, 2021 | 10:21 PM

CSK New Title Sponsor : ఐపీఎల్​లో  చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్ వచ్చింది. ఇంతకాలం చెన్నై జట్టుకు టైటిల్​ స్పాన్సర్​గా వ్యవహరిస్తున్న ముత్తూట్​ ఫైనాన్స్​ గ్రూప్​ గడువు కాలం ముగిసింది. దీంతో ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ కంపెనీ స్కోడాతో ప్రధాన స్పాన్సర్​గా  ఎంఓయూ కుదుర్చుకుంది.

అత్యంత విలువైన బ్రాండ్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) ఫ్రాంఛైజీ కొనసాగుతోంది. 14వ సీజన్‌లో ఈ ఫ్రాంచైజీ కొత్త టైటిల్‌ స్పాన్సర్‌తో బరిలో దిగనుంది. ముత్తూట్‌ ఫైనాన్స్​ గ్రూప్‌  రూ.65కోట్లు తో ఉన్న మూడేళ్ల ఒప్పందం అయిపోయింది. దీంతో చెన్నై.. ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ కంపెనీ స్కోడాతో ఒప్పందం చేసుకుంది.  దీంతో ఇప్పటి నుంచి ప్రధాన స్పాన్సర్‌గా స్కోడా వ్యవహరించనుంది.

మూడేళ్ల కాలానికి స్కోడా రూ.75కోట్లను సీఎస్కేకు చెల్లించనున్నట్లు సమాచారం. అంటే గతంలో ముత్తూట్‌ ఫైనాన్స్​ గ్రూప్ చెల్లించిన దానికంటే 10 కోట్లు ఎక్కువ అన్నమాట. కొత్త ఒప్పందంపై చెన్నై త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. స్కోడా ఆటో ఇండియా కంపెనీ 2001 నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. ధోనీ సారథ్యంలోని చెన్నై 2010, 2011, 2018 ఐపీఎల్‌ టైటిళ్లను సొంతం చేసుకుంది.