CSK: వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్.. క్రెడిట్ ఎంఎస్ ధోనీకే సొంతమా..?

|

Sep 25, 2021 | 1:11 PM

చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీద ఉంది. నిన్న బెంగళూరు రాయల్ ఛాలంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

CSK: వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్.. క్రెడిట్ ఎంఎస్ ధోనీకే  సొంతమా..?
Chennai Super Kings
Follow us on

చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీద ఉంది. నిన్న బెంగళూరు రాయల్ ఛాలంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లకు 156 పరుగులు చేసింది. చైన్నై ఈ లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగానే ఛేధించింది. డూప్లిసెస్, గైక్వాడ్, అంబటి రాయుడు రాణించటంతో ధోని సేన విజయం సాధించింది. సెప్టెంబర్ 19న జరిగిన మ్యాచ్ లో సూపర్ కింగ్స్ ముంబయి ఇండియన్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. గైక్వాడ్ 88 పరుగులతో రాణించారు. లక్ష్య ఛేధన కోసం బ్యాటింగ్ కు దిగిన ముంబయి 20 ఓవర్లకు 136 పరుగులే చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగులతో విజయం సాధించింది.

ఈ రెండు మ్యాచుల్లో చైన్నై బ్యాట్స్ మెన్స్ తోపాటు బౌలర్లు రాణించారు. వరుస విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలించింది. ఐపీఎల్ మొదటి దశలో చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచులు ఆడి ఐదింటిలో విజయం సాధించి 2 మ్యాచుల్లో ఓడిపోయింది. రెండో దశ ఐపీఎల్ లో అడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. మొత్తంగా తొమ్మిది మ్యాచులు ఆడిన చెన్నై ఏడు విజయలతో 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఫ్లే ఆఫ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా 5 మ్యాచులు ఆడనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో చెన్నై తలపడనుంది.
ధోని సేన ఇదే ఊపును కొనసాగిస్తే చైన్నై ఫైనల్ కు వెళ్లడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. చెన్నై సూపర్ కింగ్స్ విజయాలకు ధోని వ్యుహాలే కారణమని చెబుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Family Evicted: పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ పెద్దల నిర్వాకం.. పంచాయతీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని కుటుంబం వెలి

Monkey Revenge: విలన్‌గా మారిన కోతి.. రివేంజ్ తీర్చుకోవడానికి ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించింది..