
ఐసీసీ ఛాంపియన్స టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. కాగా టీమిండియాలోని ముగ్గురు సీనియర్ క్రికెటర్లకు ఇదే ఐసీసీ టోర్నమెంట్ అని తెలుస్తోది. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఇదే విషయంపై మాట్లాడాడు. ఈ ముగ్గురు ఆటగాళ్ళు తమ ఐసిసి టోర్నమెంట్‌లో చివరిసారిగా మైదానంలోకి దిగుతున్నారని జోస్యం చెప్పాడు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు దిగ్గజాలు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నారు. తాజాగా ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా గురించి మాట్లాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ ముగ్గురికి చివరి ఐసీసీ టోర్నమెంట్ అవుతుందని జోస్యం చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి నాలుగు రోజుల ముందు ఆకాష్ ఒక పెద్ద ప్రకటన చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రోహిత్, విరాట్, జడేజా టీ-20 నుంచి రిటైర్ అయ్యారు. WTC ఫైనల్ జూన్ 2025 లో జరగాల్సి ఉంది. అందులో భారత్ ఆడడం లేదు. వచ్చే ఏడాది, 2026 టి 20 ప్రపంచ కప్ జరుగుతుంది. అప్పుడు కూడా ఈ ముగ్గురిని అక్కడ చూడలేము. దీని తర్వాత, 2027లో వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. అప్పటికి ప్రపంచం చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇది వారికి చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చు అని నేను భావిస్తున్నాను. దీనికి బలమైన అవకాశాలు ఉన్నాయి’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా, ముగ్గురు భారతీయ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి చాలా చర్చలు జరిగాయి. అభిమానుల మనస్సుల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ ముగ్గురూ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతారా? ముగ్గురి వయస్సును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఈ ప్రశ్న అభిమానుల మనస్సుల్లోనే ఉంది. ముగ్గురూ 36 ఏళ్లు పైబడిన వారు. రోహిత్ 2025 ఏప్రిల్ నాటికి 38 ఏళ్లు నిండుతాయి. అయితే, ఈ ముగ్గురి ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది, కాబట్టి వయస్సు ఇకపై సమస్య కాదు. అయితే, ఈ దిగ్గజ త్రయం 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఉంటుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..