Sachin Tendulkar: నా ఫొటోలను మార్ఫింగ్ చేసి వాడారు.. వారిపై కఠిన చర్యలకు సిద్ధం: సచిన్

|

Feb 24, 2022 | 4:00 PM

తన ఫోటోను తప్పుగా ఉపయోగించడం పట్ల సచిన్ టెండూల్కర్ ఆందోళన, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశాడు.

Sachin Tendulkar: నా ఫొటోలను మార్ఫింగ్ చేసి వాడారు.. వారిపై కఠిన చర్యలకు సిద్ధం: సచిన్
Sachin Tendulkar
Follow us on

సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)  ఫిబ్రవరి 24న క్యాసినోపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పాడు. ఈ క్యాసినో తన మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో తన ప్రమోషన్ కోసం ఉపయోగించిందని ఆరోపించాడు. అయితే పేరును మాత్రం సచిన్ వెల్లడించలేదు. PTI ప్రకారం, సచిన్ టెండూల్కర్ చిత్రాన్ని గోవాలోని బిగ్ డాడీ క్యాసినో(Big Daddy Casino) తన ప్రమోషన్ కోసం ఉపయోగించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా(Social Media)లో తప్పుదారి పట్టించే చిత్రాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న సచిన్ ట్వీట్ చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

సచిన్ టెండూల్కర్ తన ఫోటోలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉపయోగించారని విచారం వ్యక్తం చేశాడు. 48 ఏళ్ల మాజీ క్రికెటర్ మాట్లాడుతూ, ‘సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా ప్రకటనలు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇందులో నేను క్యాసినో ప్రకటన చేస్తున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోను వాడారు. నేను జూదం, పొగాకు లేదా మద్యపానాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నడూ ఆమోదించలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నా చిత్రాలను వాడడం బాధాకరం’ అని ఆయన పేర్కొన్నారు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: సచిన్..
ఈ విషయంలో చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సచిన్ తెలిపారు. అయితే అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఈ స‌మాచారం ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నా న్యాయ బృందం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ అవసరమైన సమాచారాన్ని అందరికీ అందించాలని నేను భావించాను’ అని పేర్కొన్నారు.

సచిన్ కెరీర్..
సచిన్ టెండూల్కర్ క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్నాడు. 2013లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌తో మెంటార్‌గా మాత్రమే అనుబంధం కలిగి ఉన్నాడు. మధ్యమధ్యలో వ్యాఖ్యానం కూడా చూస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలోని కీలక ఆటగాళ్లలో సచిన్ ఒకరిగా పేరుగాంచాడు. 200 టెస్టుల్లో 15921 పరుగులు, 463 వన్డేల్లో 18426 పరుగులు చేశాడు. టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. అయితే, సచిన్ రిటైర్మెంట్‌కు ముందు, ఆయన ప్రకటనలకు ఎంతో డిమాండ్ ఉండేది.

Also Read: ICC: ఐసీసీ కీలక నిర్ణయాలు.. అలాంటి పరిస్థితుల్లో 9 మందితోనే బరిలోకి.. ఎందుకో తెలుసా?

India vs Sri Lanka 1st T20 Preview: తొలి పోరులో ఎవరు గెలిచేనో.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?