Aiden Markram: ప్రియురాలితో పెళ్లిపీటలెక్కిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌.. ఫొటోస్ చూశారా?

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి ఎయిడెన్‌ మార్కరమ్‌ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు నికోల్‌ మార్కరమ్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. సెంచూరియన్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో మార్కరమ్‌- నికోల్‌ల వివాహం వేడుగకా జరిగింది.

Aiden Markram: ప్రియురాలితో పెళ్లిపీటలెక్కిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌.. ఫొటోస్ చూశారా?
Aiden Markram Marriage

Updated on: Jul 23, 2023 | 6:02 PM

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి ఎయిడెన్‌ మార్కరమ్‌ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు నికోల్‌ మార్కరమ్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. సెంచూరియన్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో మార్కరమ్‌- నికోల్‌ల వివాహం వేడుగకా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా పెళ్లి అనంతరం తమ పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు కొత్త దంపతులు. దీంతో పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు మార్కరమ్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మార్కరమ్‌ ఐపీఎల్‌ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే అతని సారథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

అయితే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ కేప్‌టౌన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మార్కరమ్‌ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. మరోవైపు మార్కరమ్‌, నికోల్‌ గత పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

పెద్దల ఆశీర్వాదం లభించడంతో గతేడాది నిశ్చితార్థం జరుపుకొన్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నికోల్‌ సొంతంగా ఆన్‌లైన్‌లో ఓ జ్యూవెలరీ స్టోర్‌ను నిర్వహిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us