Cricket: 58 నిమిషాల్లో టీ20 మ్యాచ్ ఖతం.. ఫోర్లు, సిక్సర్లతో 13 బంతుల్లో 74 పరుగులు.!

|

Dec 31, 2021 | 7:39 PM

టీ20 మ్యాచ్ అంటేనే పరుగుల వరద పారడం ఖాయం. ఈ పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లను వీక్షకులుగా చేసి బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో..

Cricket: 58 నిమిషాల్లో టీ20 మ్యాచ్ ఖతం.. ఫోర్లు, సిక్సర్లతో 13 బంతుల్లో 74 పరుగులు.!
Cam Fletcher
Follow us on

టీ20 మ్యాచ్ అంటేనే పరుగుల వరద పారడం ఖాయం. ఈ పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లను వీక్షకులుగా చేసి బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడతారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్‌లో జరిగిన ఓ మ్యాచ్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. డిసెంబర్ 31వ తేదీన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, కాంటర్బరీ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. బౌలర్లను ఊచకోత కోస్తూ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. ఇటీవల టెస్టుల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన ఆఫ్ స్పిన్నర్ అజీజ్ పటేల్‌ బౌలింగ్‌ను ఇద్దరు బ్యాట్స్‌మెన్లు 300కిపైగా స్ట్రైక్ రేట్‌తో ఉతికి ఆరేశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ టామ్ బ్రూస్ 36 బంతుల్లో 8 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 93 పరుగుల చేయగా.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డేన్ క్లీవర్ 32 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇక 218 పరుగుల భారీ లక్ష్యచేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన కాంటర్బరీ జట్టు కేవలం 17.5 ఓవర్లలోనే టార్గెట్ చేధించింది. ఇంతటి భారీ లక్ష్యాన్ని చేధించడంలో 25 ఏళ్ల హెన్రీ సిప్లీ, 28 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్యామ్ ఫ్లెచర్‌లు కీలక పాత్రలు పోషించారు.

58 నిమిషాల్లో మ్యాచ్ ఖతం.!

క్యామ్ ఫ్లెచర్ కేవలం 21 బంతుల్లో 6 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో అజేయంగా 48 పరుగులు చేయగా.. హెన్రీ సిప్లీ 354.54 స్ట్రైక్ రేట్‌తో 11 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 58 నిమిషాల్లో మ్యాచ్ ముగించారు. అంతేకాకుండా వీరిద్దరూ అజీజ్ పటేల్ బౌలింగ్‌ను ఉతికారేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో అజీజ్ పటేల్ 2 ఓవర్లలో 31 పరుగులు సమర్పించుకున్నాడు.