
Bulgaria vs Gibraltar: ఏసీఎన్ (ACN) బల్గేరియా టీ20 ట్రై సిరీస్ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ బల్గేరియా వర్సెస్ జిబ్రాల్టర్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బల్గేరియా గెలిచినప్పటికీ, ఈ మ్యాచ్‌లో రెండు జట్ల బ్యాటర్లు బౌలర్లను ఉతికారేశారు. ఈ మ్యాచ్‌లో 14.18 రన్ రేట్‌తో పరుగులు సాధించారు. ఇది టీ20 క్రికెట్‌లో మొదటిసారి. గతంలో, 2009లో న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య 13.76 రన్ రేట్‌తో పరుగులు నమోదయ్యాయి. ఈ టీ20 మ్యాచ్‌లో మొత్తం 41 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది మాత్రమే కాదు, రెండు ఇన్నింగ్స్‌లలో 35 ఓవర్లలోపు ఇక్కడ 450 కంటే ఎక్కువ పరుగులు నమోదయ్యాయి.
సోఫియాలోని నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ వాసిల్ లెవ్స్కీ వేదికగా జరిగిన ఈసీఎన్ బల్గేరియా టీ20 టోర్నమెంట్ మ్యాచ్‌లో బుల్గేరియా జట్టు జిబ్రాల్టర్‌పై ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ శుక్రవారం జులై 11, 2025న జరిగింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న జిబ్రాల్టర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. జిబ్రాల్టర్ తరపున ఫిల్ రైక్స్ (73 పరుగులు, 33 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు), మైఖేల్ రైక్స్ (21 పరుగులు) శుభారంభం అందించారు. అనంతరం ఇయాన్ లాటిన్ (51 పరుగులు), క్రిస్ పైల్ (22 పరుగులు) తమవంతు రాణించారు. బుల్గేరియా బౌలర్లలో జాకబ్ గుల్ 4 వికెట్లు పడగొట్టి జిబ్రాల్టర్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.
244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బుల్గేరియా జట్టు కేవలం 14.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం నమోదు చేసింది. బుల్గేరియా బ్యాట్స్‌మెన్ల విధ్వంసం జిబ్రాల్టర్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఇసా జరూ 24 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు, మిలెన్ గోగేవ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 69 పరుగులు, మనాన్ బషీర్ కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మనాన్ బషీర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జిబ్రాల్టర్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. జిబ్రాల్టర్ బౌలర్లలో లూయిస్ బ్రూస్ 2 వికెట్లు, కబీర్ మిర్పురి, కెన్రోయ్ నెస్ట్ ఒక్కో వికెట్ తీశారు.
ఈ విజయం ఈసీఎన్ బల్గేరియా టీ20 టోర్నమెంట్‌లో బుల్గేరియాకు శుభారంభాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచిన జాకబ్ గుల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..