భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ క్రికెటర్లను ఆ దేశ నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎప్పుడూ జరిగేదే.. బట్ మాజీ క్రికెటర్లు కూడా కొందరు పాకిస్థాన్ సారథిపై విరుచుకు పడుతున్నారు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాక్ మాజీ ప్లేయర్ అక్తర్..సర్ఫరాజ్‌పై విమర్శలు ఎక్కుపెట్టాడు. సర్ఫరాజ్‌కు బుద్ది మాంద్యం ఉందని..అందుకే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటాడని విమర్శించాడు.
భారత్‌తో మ్యాచ్‌లో కేవలం సర్ఫరాజ్ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాల వల్లే మ్యాచ్‌ను కోల్పోయామని ఆవేదనను వ్యక్తం చేశాడు. పాక్ ప్రధాన బలం బౌలింగ్ అని.. అటువంటప్పుడు తొలుత బౌలింగ్ చేయడం చాలా పెద్ద మిస్టేక్ అన్నాడు. టాస్ గెలవగానే పాక్ సగం మ్యాచ్ గెలిచినట్టేనని తామంతా భావించామని.. కానీ భారత్‌కు తొలుత బ్యాటింగ్ అప్పగించి సర్ఫరాజ్ బ్లండర్ మిస్టేక్ చేశాడని అక్తర్ విమర్శించారు. సర్ఫరాజ్‌ది బ్రెయిన్‌లెస్ కెప్టెన్సీ అని విమర్శించిన అక్తర్.. ప్రతి మ్యాచ్‌లోనూ బుద్ధి లేని నిర్ణయాలు తీసుకుంటున్నాడని అన్నాడు.