Swiggy vs Rohit Sharma Fans: ఐపీఎల్ 2021 సీజన్ 14 ఊపందుకుంది. ఓటమితో లీగ్ ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్ తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ పై విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక్కొక్కటి 2 మ్యాచ్‌లను ఆడాయి. ముంబై ఇండియన్స్ జట్టుకి సారధ్యం వహిస్తున్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ సీజన్ 14 లో కోల్‌కతాను 10 పరుగుల తేడాతో ఓడించి ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే మ్యాచ్ ప్రారంభంలో ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గి రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
ముంబై ఇండియన్స్ సారథి, భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను ట్రోల్ చేసేందుకు చూసిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ. ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఫుడ్ ఆర్డర్స్‌ను పెంచుకోవాలనే ఆలోచనలతో స్విగ్గీ క్రికెట్ చేసిన వ్యాఖ్యలు అసలుకు ఎసరు పెట్టేలా ఉంది. క్రికెట్ యాంకర్ మయాంతి లంగర్.. కోల్ కతా పై జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 200 కొడితే తనకు వడాపావ్ కావాలి… హిట్‌మ్యాన్‌కి గౌరవం ఇవ్వాలి అంటూ వివాదాస్పద ట్విట్ చేసి.. దానిని స్విగ్గీని ట్యాగ్ చేసింది. అయితే ఈ ట్విట్ పై స్విగ్గి తీవ్ర వ్యాఖ్యలతో పాటు ఓ ఫోటో షాప్ ఎడిటెడ్ ఫోటోను షేర్ చేసింది. స్విగ్గి .. మయంతి ట్విట్ ని రిప్లై ఇస్తూ.. తాము ముంబై ఇండియన్స్ బాయ్స్‌ను లవ్ చేస్తున్నామని.. మయాంతి లంగర్, మీరు ఫైర్‌లో ఉన్నారు. ఛాలెంజ్ అంగీకరిస్తున్నామంటూ కామెంట్ చేసింది. అంతేకాదు రోహిత్ శర్మ వడాపావ్ బండి ముందు వాలిపోతున్నట్టు ఓ నెటిజన్ ఎడిట్ చేసి వేసిన ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోకి హేటర్స్ దీన్ని ఫోటోషాప్ చేశారని అంటారని కామెంట్ చేసింది స్విగ్గీ.
దీంతో రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాయ్‌కాట్ స్విగ్గీ’’ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన లెజెండరీ క్రికెటర్ రోహిత్ శర్మని స్విగ్గి ఇలా కామెంట్ చేయడం దారుణమని స్విగ్గి యాప్ ను డిలీట్ చేయమని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే తన తప్పును గ్రహించిన స్విగ్గి ఆ ట్విట్ ని వెంటనే డిలీట్ చేసినా.. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. బాయ్ కట్ స్విగ్గి ట్రెండ్ అవుతుంది.
Also Read: స్పిన్‌కు అనుకూలంగా పిచ్‌లు.. బ్యాటింగ్ పక్కన పెట్టి..బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న హిట్‌మ్యాన్
శ్రీరామ నవమి రోజున పానకం వడపప్పుకి అత్యంత ప్రాధ్యాన్యత.. వీటి రెసిపీ ఏమిటంటే..!