రిషబ్‌ పంత్‌పై అసహనం వ్యక్తం చేసిన కోచ్‌..! అతడికి మరో ఓవర్‌ బౌలింగ్‌ ఇస్తే బాగుండని మండిపాటు..

|

Apr 16, 2021 | 12:46 PM

Ricky Ponting Coments : ఐపీఎల్ -2021 లో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ ఇందులో ఢిల్లీని మూడు వికెట్ల తేడాతో ఓడించింది.

రిషబ్‌ పంత్‌పై అసహనం వ్యక్తం చేసిన కోచ్‌..! అతడికి మరో ఓవర్‌ బౌలింగ్‌ ఇస్తే బాగుండని మండిపాటు..
Ricky Ponting
Follow us on

Ricky Ponting Coments : ఐపీఎల్ -2021 లో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ ఇందులో ఢిల్లీని మూడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ రాజస్థాన్‌ను బ్యాక్ ఫుట్‌లోకి నెట్టింది కానీ డేవిడ్ మిల్లర్‌, క్రిస్ మోరిస్ రాజస్థాన్‌ను తమ బ్యాటింగ్‌తో ఢిల్లీని ఓడించారు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు తొలి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోటాలో మొత్తం నాలుగు ఓవర్లను అతను పొందలేదు.

అశ్విన్ రాజస్థాన్‌పై కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అశ్విన్ ఏడు, తొమ్మిది, 11 వ ఓవర్ బౌలింగ్ చేశాడు. అతని వికెట్ రాలేదు కానీ పరుగులను ఆపగలిగాడు. పంత్ అతనికి మరో ఓవర్ ఇచ్చి ఉంటే మిల్లర్‌ను ముందే అవుట్ చేసి ఉండవచ్చు, మోరిస్‌ను కూడా ఆపివేసి ఉండవచ్చు. పంత్ పద్దతి ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ నచ్చడం లేదు.

పాంటింగ్ మాట్లాడుతూ.. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని జట్టు తనకు నాలుగో ఓవర్ ఇవ్వకపోవడం పొరపాటు అన్నాడు. జట్టుతో కూర్చుని మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు తాను కచ్చితంగా దాని గురించి మాట్లాడతానన్నాడు. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో ఎటువంటి వికెట్లు లేకుండా 14 పరుగులు మాత్రమే ఇచ్చాడన్నాడు. మొదటి మ్యాచ్‌లో అతని ఆటతీరు బాగా లేదు కానీ కొద్ది రోజులుగా అతను చాలా కష్టపడుతున్నాడని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో బాగా రాణించాడని, ఇది మేము చేసిన పొరపాటే అని తెలిపాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పంత్ 51 పరుగుల సహాయంతో రాజస్థాన్ ముందు 148 పరుగుల లక్ష్యం ఉంచింది. పేలవమైన ఆరంభం నుంచి కోలుకున్న రాజస్థాన్ డేవిడ్ మిల్లెర్ 43 బంతుల్లో 62, మోరిస్ 18 బంతుల్లో అజేయంగా 36 పరుగుల సహాయంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించారు. తమ బౌలర్లు మోరిస్‌కు చివరి ఓవర్లో పరుగులు చేసే అవకాశం ఇచ్చారని పాంటింగ్ చెప్పాడు.

IPL 2021 : మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌కి షాకిచ్చిన బీసీసీఐ..! ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు..?

Kesineni Nani: ఏపీలో కరోనా కల్లోలం.. టీడీపీ ఎంపీ కేశినేని నానికి కోవిడ్ పాజిటివ్..

ఆ ఇంటి సమీపంలో మూడు రోజులుగా పాములు వస్తూనే ఉన్నాయి.. మరి ఆ ఇంటివారు ఏం చేశారంటే..