PBKS vs DC: రీఎంట్రీలో నిరాశపర్చిన రిషబ్ పంత్.. ఢిల్లీతో మ్యాచ్ లో పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మధ్య ఓవర్లలో ఢిల్లీ బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు.

PBKS vs DC: రీఎంట్రీలో నిరాశపర్చిన రిషబ్ పంత్.. ఢిల్లీతో మ్యాచ్ లో పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
Pbks Vs Dc Match

Updated on: Mar 23, 2024 | 6:19 PM

 

ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మధ్య ఓవర్లలో ఢిల్లీ బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ రీ ఎంట్రీ మ్యాచ్ లో నిరాశపర్చాడు. 13 బంతుల్లో 2 ఫోర్ల సహాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకు ముందు మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌ జోడీ శుభారంభం చేసింది. మూడు ఓవర్లలో వీరిద్దరూ 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ నాలుగో ఓవర్‌లో మిచెల్ మార్ష్ వికెట్ పడింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, షాయ్ హోప్ కలిశారు. వీరిద్దరూ 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడీని బద్దలు కొట్టడంలో హర్షల్ పటేల్ సక్సెస్ అయ్యాడు. డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్  కు పంపాడు. ఆ తర్వాత అందరి కోసం ఎదురు చూస్తున్న రిషబ్ పంత్ కేవలం 12 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత హర్షల్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

ఇవి కూడా చదవండి

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో 7 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్‌ తరఫున హర్షల్‌ పటేల్‌ చక్కటి బౌలింగ్‌ చేశాడు. హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ 1-1తో చెలరేగగా, హర్షల్ 2 వికెట్లు తీశాడు. పంజాబ్ కింగ్స్ తరఫున హర్షల్ పటేల్ మూడు ఓవర్లు బాగా బౌలింగ్ చేశాడు. కానీ చివరి ఓవర్లో అభిషేక్ పోరెల్ పంజాబ్ బౌలర్లను కడిగిపారేశాడు. చివరి ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి. అభిషేక్ పోరెల్ 10 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

 

రిషబ్ కు స్టాండింగ్ ఓవేషన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..