IND vs AUS : బర్త్ డే బాయ్‎కి షాక్.. చివరి టీ20 ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అవుట్.. రింకూ సింగ్‌కు ఛాన్స్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఈరోజు చివరి మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న టీమిండియా తుది జట్టులో ఒక అనూహ్య మార్పు చేసింది.

IND vs AUS : బర్త్ డే బాయ్‎కి షాక్.. చివరి టీ20 ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అవుట్.. రింకూ సింగ్‌కు ఛాన్స్
Tilak Varma Rinku Singh

Updated on: Nov 08, 2025 | 2:12 PM

IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఈరోజు చివరి మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న టీమిండియా తుది జట్టులో ఒక అనూహ్య మార్పు చేసింది. నేడు తన 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న యంగ్ ప్లేయర్‎ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించి ఆసియా కప్ 2025 ఫైనల్‌లో విజయవంతమైన షాట్‌తో జట్టుకు కప్ అందించిన మరొక కీలక బ్యాట్స్‌మెన్‌కు చోటు కల్పించింది.

బ్రిస్బేన్‌లో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ముఖ్యమైన మార్పు చేశాడు. నేడు (నవంబర్ 8) తన 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న మధ్యస్థాయి బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు విశ్రాంతి (Rest) ఇచ్చారు. ఈ సిరీస్‌లో తిలక్ వర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతను ఆడిన 3 మ్యాచ్‌లలో కేవలం 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 29 పరుగులు మాత్రమే.

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులు చేసి జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించినా, ఆస్ట్రేలియా సిరీస్‌లో అతని బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. తిలక్ వర్మ స్థానంలో ఆసియా కప్ ఫైనల్ హీరోగా పేరొందిన లెఫ్ట్ హ్యండ్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది.

ఆసియా కప్‌లో రింకూ సింగ్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం మాత్రమే దక్కింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అతను బౌండరీ కొట్టి, టీమిండియాకు కప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. రింకూ సింగ్ ఇప్పటివరకు 34 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 42.30 సగటుతో 550 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

తిలక్ వర్మ తన బర్త్‌డే రోజున మ్యాచ్ ఆడకపోయినా అతని టీ20 అంతర్జాతీయ కెరీర్ గణాంకాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తిలక్ వర్మ ఇప్పటివరకు 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 47.42 సగటుతో 996 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈరోజు రింకూ సింగ్ తన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్లకు ఎలా సమాధానం చెబుతాడో, టీమిండియా సిరీస్‌ను గెలుస్తుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుల్ స్కోర్ బోర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..